ఆంధ్రప్రదేశ్ లో చిరస్మరణీయ విజయం సాధించిన తెలుగుదేశం కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు.‘’ప్రియమైన చంద్రబాబు మామయ్యకి… ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మెతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు” అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావడం కానీ, మీడియా ద్వారా మద్దతు పలకడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో జూనియర్, చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది అన్న అనుమానాలు ఉన్నాయి.
ఇక నారా లోకేష్ భవిష్యత్తుకు జూనియర్ అడ్డు అవుతాడనే పక్కన పెట్టారని ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో గత కొన్నేళ్లుగా జూనియర్ సైలెంటుగా ఉంటున్నాడు. ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. తాజాగా ఏపీలో టీడీపీ ఘనవిజయంతో జూనియర్ స్పందనపై అందరి దృష్టి మళ్లింది. ఎట్టకేలకు జూనియర్ ట్వీట్ ద్వారా స్పందించడంతో మంగమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.