యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. దేవర పార్ట్ 1ను సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ రోజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. అయితే ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఎన్టీఆర్ మీట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి సోమవారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డిని ఎన్టీఆర్ ఎందుకు కలిశారో మొదట ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఇద్దరు కలిసి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. దేవర కోసం ఓ ఇంటర్వ్యూ చేసేందుకే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి కలిశారని తెలుస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పిక్ లో.. ఎన్టీఆర్ స్మార్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన ధరించిన స్టైలిష్ షోస్ అభిమానులను, నెటిజన్లను బాగా ఆకర్షించాయి. బాలెన్సియాగా(Balenciaga) అనే బ్రాండెడ్ షూస్ ను ఎన్టీఆర్ ధరించాడు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఆ షో ధరెంతో తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చింగ్ మొదలెట్టిన నెటిజన్లకు దిమ్మతిరిగే షాక్ తగిలించింది. ఎందుకంటే, ఎన్టీఆర్ వేసుకున్న ఆ స్టైలిష్ షోస్ ధర 995 డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 80 వేలకు పైమాటే.