బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో స్టార్ హీరోలు మల్టీ స్టారర్లు చేసే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, టాలీవుడ్ మాత్రం ఈ విషయంలో కొద్దిగా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. అడపాదడపా ఎవరన్నా చిన్న హీరోలు మల్టీ స్టారర్లతో అలరించడం తప్ప స్టార్ హీరోలు డేర్ చేసి భారీ మల్టీ స్టారర్ చిత్రాలు చేసిన దాఖలాలు లేవు. అయితే, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ లోనూ భారీ మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత టాలీవుడ్ లోనూ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ఎఫ్-2, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు భారీ మల్టీస్టారర్ లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తనకు ఓ స్టార్ హీరోతో మల్టీ స్టారర్ చేయాలనుందని యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన మనసులో మాట చెప్పాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్లలో ఉన్న అబ్బాయి తారక్…బాలయ్య బాబాబుతో ఓ భారీ చిత్రంలో నటించాలనుందంటూ వెల్లడించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారిందన్న తారక్…మల్టీ స్టారర్ మూవీస్ కు క్రేజ్ పెరిగిందని చెప్పాడు. బాబాయ్ బాలయ్యతో తాను కలిసి నటించాలనుకుంటున్నట్లు చెప్పారు తారక్. అంతేకాదు, అవకాశం వస్తే చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ అందరితోనూ మల్టీ స్టారర్ సినిమా చేస్తానని మనసులోమాట బయటపెట్టాడు. గతంలో హీరో పాత్ర ప్రయారిటీ, సీన్లపై తేడాలుండేవని….కానీ, ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు వాటన్నింటినీ దాటుకుని ముందుకొచ్చారని చెప్పాడు తారక్. హీరో పాత్రలు ఇలానే ఉండాలనే లెక్కలు ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదని, అభిమానులు కూడా పాత్రల నిడివి పట్టించుకోవడం మానేశారని, కాబట్టి ఎవరైనా ఏ భాషలోనైనా నటించొచ్చని చెప్పుకొచ్చాడు కొమురం భీం.