నిలువెత్తు తెలుగుతేజం,నిండైన వ్యక్తిత్వం..అనేక యుద్ధాల ఆరితేరిన ధీరోదాత్తత,స్పురద్రూపం..చూసి మురిసే సమ్మోహనకరం..అయిదు దశాబ్దాల సంచలనం, ఆరు కాలాల ప్రభావం..బడుగు జన భాంధవుడు,అట్టడుగు ప్రజల ‘అన్న’..అతడిని చూస్తే జనం సముద్రించిన కెరటాలవుతారు…వాళ్ళ గొంతులు పెను కేకలవుతాయి..అతడు గళమెత్తి గర్జిస్తే, ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ప్రతిధ్వనిస్తుంది.ఆయన ఒక మహా ప్రభంజనం.అందుకు నిదర్శనం ఆరు కోట్ల ఆంధ్రుల ఏకైక నిర్ణయం.ఝలఝలఝలా ప్రవహించే గోదావరిని ప్రశ్నించినా, బిరబిరా పరుగులిడే కృష్ణమ్మను కదిలించినా, ఉత్తుంగ తరంగ తుంగ భద్రమ్మను మెదిలించినా చెప్పే సమాధానం ఒక్కటే..అదే ఆంధ్ర దేశపు అభిమాన కథానాయకుడు “ఎన్.టి.ఆర్. ” ‘సమాజమే దేవాలం-ప్రజలే దేవుళ్ళు’ అని నమ్మి,నిన్ను ఆరాధించిన ఈ తెలుగు జాతికి,నిన్నుగుండెల్లో పెట్టుకున్నఈ తెలుగు ప్రజల కన్నీళ్లు తుడవడానికే అవతరించిన యుగపురుషుడివి నీవు. రాముడు ఎలా ఉంటాడో నాకు తెలియదు..శ్రీకృష్ణుని అవతారం ఎలా ఉంటుందో నేను చూడనేలేదు..రాముడివై, కృష్ణుడివై ప్రతి తెలుగింట దైవమై.. పూజలందుకుంటున్న మీకు నాలుగు తెలుగు అక్షరాల మల్లెల మాలలు వేయగలను తప్ప ఇంక ఏమి ఇవ్వగలను? ఓ యుగాపురుషుడా, మీ రాకకై నిరీక్షిస్తూ, మిమ్ము మరోసారి గాంచి పూజించే భాగ్యానికి వేచి చూస్తూ..మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలి.. మా ఇంట్లోనే పుట్టాలి.. మీరు మాకే కావాలి అనే
మీ స్వార్ధపరుడు…
Dr నిరంజన్ మోటూరి