విజయం ఎప్పుడూ ఆనందమే. కానీ.. కొన్ని విజయాలు ఎప్పటికి మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తుంటాయి. జో బైడెన్ కు తాజాగా లభించిన గెలుపు ఈ కోవకు చెందినదే. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే ఇదే నవంబరు 7న ఆయన జీవితంలో తొలి రాజకీయ విజయాన్ని సాధించారు. సరిగ్గా 48 ఏళ్ల క్రితం.. నవంబరు 7న ఆయన యువ సెనెటర్ గా విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కట్ చేస్తే.. మళ్లీ అదే నవంబరు 7న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైనట్లుగా పలితాలు స్పష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావటానికి 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరమవుతాయి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి అడుగు దూరం వరకు వచ్చిన ఆయన.. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తేలటానికి ఏకంగా మూడు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది.
పోలింగ్ మూడున ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమైంది. పెద్ద ఎత్తున ఈ మొయిల్.. పోస్టల్ ఓట్లు రావటం.. ప్రతి ఓటును లెక్కించాలన్న నియమం.. తదుపరి ఫలితాలు విడుదల కావటానికి ఆలస్యమైంది. విజయానికి అవసరమైన 270 ఓట్లకు.. 264 ఓట్లు వచ్చి ఆగటం.. తదుపరి ఫలితాన్ని తేల్చే నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కావటం.. తీవ్ర ఉత్కంటకు దారి తీసింది.
ఎట్టకేలకు 290 సీట్లను సొంతం చేసుకోవటం ద్వారా తిరుగులేని మెజార్టీతో అమెరికా అద్యక్ష పీఠాన్ని జో బైడెన్ సొంతం చేసుకున్నారు. దీంతో.. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక కానున్నారు. 77 ఏళ్ల బైడెన్ కు నవంబరు 7తో చక్కటి సంబంధం ఉంది. 48 ఏళ్ల క్రితం ఇదే రోజున.. ఆయన యువ సెనెటర్ గా విజయం సాధించారు. తొలిసారి సెనెట్ కు పోటీ చేసిన సమయంలో కూడా.. ఆయన ఎన్నిక ఫలితం ఆలస్యమైంది. తొలిసారి అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ఆయన ఫలితం తేలేందుకు ఆలస్యమైంది. లేటు అయితే కానీ.. మర్చిపోలేని విజయాన్ని జో సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.