కాలిఫోర్నియాలోని విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేట) వ్యవస్థాపక అధ్యక్షరాలు ‘హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి’ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత ‘రాహుల్ గాంధీ’ అమెరికా పర్యటనలో ‘ఝాన్సీ రెడ్డి’ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘రాహుల్ గాంధీ’తో భేటీ అయి పలు కీలక విషయాలు చర్చించారు.
ఈ క్రమంలోనే భావి భారత ప్రధాని ‘రాహుల్ గాంధీ’ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
జూలై 2న ఖమ్మంలో జరగబోయే తెలంగాణ జన గర్జన కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
రాహుల్ గాంధీతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ పెద్దలు, కాంగ్రెస్ నేతల సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ‘ఝాన్సీ రెడ్డి’ సన్నద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు.
ఛలో ఖమ్మం సభకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.