తిరుమల శ్రీవారి ధనాగారంలో పింక్ డైమండ్ లేకపోయినప్పటికీ.. ఆ డైమండ్ ఉందని నా చేత చెప్పించారు.. ఆ డైమండ్‌ను చంద్రబాబు తీసుకెళ్లారని ప్రచారం చేయించారు. నన్ను శ్రీవారి ప్రధాన అర్చకుడి పదవి నుండి తొలగించినప్పుడు నీ వెనకాల నేనున్నాను.. మళ్లీ ప్రధాన అర్చక పదవిలో నియమిస్తానని నమ్మకంతో నమ్మించి సిఎం జగన్‌రెడ్డి నన్ను నట్టేట ముంచారని తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు.. రమణ దీక్షితులు బయట పడుతున్నారట. శ్రీవారి ప్రధాన అర్చక పదవి లేకుంటే తనను ఎవరు ఖాతరు చేయటం లేదని.. రమణ దీక్షితులకు అనుభవంతో కానీ తెలిసి రాలేదు. చంద్రబాబు హయాంలోనే రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుండి తొలగిస్తారని ప్రచారం జరిగినా.. అప్పట్లో చంద్రబాబు కఠినంగా వ్యవహరించలేకపోయారు. కానీ తిరుమల శ్రీవారి ధనాగారంలో పింక్ డైమండ్ లేనప్పటికీ.. అది ఉందని ఒకసారి.. ఆ డైమండ్ పగిలిపోయిందని మరో సారి… దానిని చంద్రబాబు తీసుకెళ్లారని మరోసారి జరిగిన ప్రచారాల వెనుక రమణ దీక్షితుల హస్తం ఉందని టిటిడి అధికారులందరికీ తెలుసు.
తిరుమల శ్రీవారి ధనాగారంలో పింక్ డైమండ్ అనేది లేదని.. మేము ఎన్నడూ చూడలేదని టిటిడి ఈవోలుగా బాధ్యతలు నిర్వహించిన ఐఎఎస్ అధికారులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అయినా సరే ఆ పింక్ డైమండ్‌ను చంద్రబాబు కొట్టేశారని.. చంద్రబాబుపై అభాండాలు వేశారు. దీనికంతటికి సూత్రదారుడు, పాత్రదారుడు అయిన రమణ దీక్షితులకు తాను ఆశించిన శ్రీవారి ప్రధాన అర్చకుడి పదవి లభించకపోవటంతో.. పింక్ డైమండ్ ఉందని తప్పు చేశానని పశ్చాత్తాపడ్డారట. నన్ను నమ్మించి నట్టేట ముంచారని తాజాగా రమణ దీక్షితులు వాపోతున్నా.. చేసిన పాపాలు…చేసిన దుష్ప్రచారం మళ్లీ తిరిగిరావు కదా.. రమణ దీక్షితులను ఎట్టి పరిస్థితుల్లో తిరుమల ప్రధాన అర్చక పదవిలో నియమించకూడదని.. ఒకవేళ ఆయనను నియమిస్తే.. మేమందరం స్వచ్చందంగా వెళ్లిపోతామంటున్నారు ప్రస్తుత శ్రీవారి ప్రధాన అర్చకులు. పింక్ డైమండ్ విషయంపై టిటిడి ఈవోలను, జేఈవోలను తిరుమల దేవాలయ అధికారులను (వీరిలో చాలా మంది సర్వీసు నుండి రిటైర్డు అయ్యారు) స్వయంగా కలిసి కొంతమంది అడిగినప్పుడు పింక్ డైమండ్ అనేది కల్పితం. ఇదంతా కుట్ర ప్రకారం చంద్రబాబుపై దుష్ప్రచారం జరిగిందన్నారు.