‘జయరాం కోమటి’ అమెరికాలో సుపరిచితమైన పేరు. తన తండ్రి మైలవరం మాజీ శాసనసభ్యులు, సమితి అధ్యక్షులుగా మరియు ఇంకా అనేక పదవులను అధిరోహించిన దివంగత నేత శ్రీ ‘కోమటి భాస్కరావు’ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఈ స్థాయికి ఎదిగారు. పదవి కొంతమందికి వన్నె తెస్తే, పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి జయరాం. ఆయన 66వ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ అభిమానులు, వివిధ తెలుగు సంఘాలకు చెందిన వాళ్లు మరియు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ‘శశి దొప్పలపూడి వ్యవసాయ క్షేత్రం’లో అత్యంత వైభవంగా నిర్వహించారు.
‘తానా’ అధ్యక్షడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అమెరికా ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ అమెరికా విభాగం కో ఆర్డినేటర్ గా ఇంకా అనేకమైన పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు. అమెరికా తెలుగు సంఘములో అత్యంత గుర్తింపు గౌరవం కలిగిన అతి కొద్దిమందిలో ముందు వరసలో ఉంటారు. ‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు’ ఇంత ఘనంగా క్రమం తప్పకుండా నిర్వహించడం జయరాంకే సాధ్యపడింది. అమెరికా లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ప్రవాసాంధ్రులలోకి తీసుకువెళ్లడం ద్వారా ‘చంద్రబాబు నాయుడు’ అభిమానాన్ని చూరగొన్నారు. ఎందరెందరో ఎదుగుదలకు దోహదపడిన మనిషి, మరెందరో ఆత్మీయతను చూరగొన్న మనిషి, ఇంకెందరికో దారి చూపిన మనిషి జీవితంలో ఇంతకన్నా సాధించగలిగేది ఏముంది. అందుకే ఆయన జీవితం చరితార్థం. సంతృప్తిగా జీవిస్తున్న అనే తృప్తి, అది ఆయన ముఖకవళికలలో, ఆయన చిరునవ్వులో, ఆయన పనిలో, ఆయన మాటలలో నిత్య యవ్వనం తొంగిచూస్తూ ఉంటుంది. ఎదుటివారిని సమ్మోహన పరుస్తుంది. అందుకే నలుగురి కోసం అన్న భావన ఆయన స్వభావంలో ఒక బాగమైయింది. ఆయన జీవితంలో బాగా రాణించాలని, ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
శ్రీకాంత్ దొడ్డపనేని, కళ్యాణ్ కోట, లక్ష్మణ్ పరుచూరి ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ ఆంజనేయులు, శశి దొప్పలపూడి, మరియు లియోన్ బోయపాటి తో కలసి సమన్వయ పరిచారు.
జయరాంకి అత్యంత సన్నిహితుడైన సుబ్బా యంత్రా, అమరావతిపై ఇటీవల ‘కందుల రమేష్’ రచించిన ‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ పుస్తకాన్నిఇండియా నుండి తెప్పించి జయరాంకి బహుకరించడం విశేషం.
కోటేశ్వర రావు చెరుకూరి చక్కటి పాత సినిమా పాటలను పాడి ఆహ్లాదపరిచారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారిలో మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ టీడీపీ మీడియా మరియు గిడ్డంగుల చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, స్వరూప్ వాసిరెడ్డి, భక్త బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోడూరి, గంగ కోమటి, సతీష్ బోళ్ళ, విజయ ఆసూరి, శ్రీలు వెలిగేటి, శ్రీదేవి, భాస్కర్ వల్లభనేని, రామ్ తోట, వీరు ఉప్పల, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, ప్రసాద్ మంగిన, గోకుల్ రాచిరాజు, భరత్ ముప్పిరాల, సుధీర్ ఉన్నం, విజయకృష్ణ గుమ్మడి, వెంకట్ అడుసుమల్లి, తిరుపతి రావు, బెజవాడ శ్రీను, వీరబాబు, శ్రీధర్ చావా, సూర్య కోటప్రోలు, సురేష్ ద్రోణవల్లి, కాసి సుంకర, సురేష్ రెడ్డి, సందీప్ ఇంటూరి తదితరులు ఉన్నారు.