తన స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించి.. అనేక మంది హీరోలకు పేరు తెచ్చిపెట్టిన డ్యాన్స్ మాస్టర్ జానీ కి మరో కష్టం వచ్చిపడింది. ఓ మహిళా డ్యాన్సర్‌ను వేధించిన కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడం.. జైల్లో పెట్టడం తెలిసిందే. ఈ పరిణామాలపై విచారణ కొనసాగుతోంది. అయితే.. జానీలో ఉన్న కళా ప్రతిభను గుర్తించిన జాతీయ సినీ రంగం.. 2022 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీని ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ప్యానెల్ అనేక రూపాల్లో వడ పోతల అనంతరం జానీకి నేషనల్ అవార్డును ఇవ్వాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించిన వేడుక కూడా సిద్ధమైంది. ఈ నెల 8(మంగళవారం)న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలోనే జానీ మాస్టర్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును అందుకో వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన మధ్యంత బెయిల్‌ను కూడా తెచ్చుకున్నారు. ఆదివారం(అక్టోబరు 6) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు స్థానిక కోర్టు జానీకి ఇంటీరియమ్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఇంత కష్టంలో ఉన్న జానీకి .. అవార్డు రూపంలో కొంత ఊరట దక్కుతోందని ఆయన అభిమానులు కూడా భావించారు.
కానీ, ఇంతలోనే సదరు అవార్డును రద్దు చేస్తూ.. నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్యానెల్ నిర్ణయించింది. అవార్డు ఫంక్షన్ అయితే జరుగు తుంది. కానీ, జానీ మాస్టర్‌కు మాత్రం అవార్డు ఇవ్వరు. రాదు. దీనికి కారణం.. జానీపై అత్యంత తీవ్రమైన పోక్సో(మహిళలను లైంగికంగా వేధించడం.. అత్యాచారం చేయడం.. మోసం చేయడం) చట్టం కింద కేసు నమోదు కావడమేనని జ్యూరీ కమిటీ పేర్కొం ది. దీనిపై అన్ని కోణాల్లోనూ ఆలోచించినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. దీంతో అవార్డును రద్దు చేయడంతోపాటు.. ఇప్పటికే జానీ కోసం సిద్ధం చేసిన ఆహ్వాన పత్రిక, ఫ్లైట్ టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఒక్క తప్పు.. ఎన్ని మెట్లు దిగేలా చేసిందో జానీని చూస్తే.. అర్థం అవుతుందని అంటున్నారు పరిశీలకులు.