పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసాారా తాగి పలువురు మరణించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహమ్మారి వల్ల కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలుకాగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి పలువురు మరణించిన ఘటనపై మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతి చెందిన వారు తాగుబోతులని, అందుకే పోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మంత్రి వ్యాఖ్యలను మృతుల కుటుంబసభ్యులు ఖండించారు.
ఆహారం, నీరు మానేసి మందు తాగడం వల్లే వారంతా మృతి చెందారని మంత్రి చెప్పిన మాటలు అబద్ధమని మృతుడు అనిల్‌కుమార్ సోదరి అన్నారు. తన తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, కల్తీ సారా తాగటం వల్లే మరణించాడని ఆమె చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా వల్లే చాలా మంది చనిపోయారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. నాటుసారా తాగి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా అనుమానిత మరణాలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ రోజు చనిపోయిన ఒడిశా వాసి ఉపేంద్ర గుండె సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన నలుగురు గత కొద్ది రోజులుగా… విపరీతంగా మందు తాగుతున్నారని.. వారంతా తాగుబోతులని అందువల్లే మృతిచెందారని అన్నారు.
మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. సారా తాగే అలవాటున్న నలుగురు అనారోగ్య కారణాలతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఉప్పలమెట్టకు చెందిన వెంపల అనిల్ కుమార్ (35), గౌరీశంకరపురానికి చెందిన సునాని ఉపేంద్ర (30) గంటన్నరలోనే కన్నుమూశారు. మృతుడు అనిల్ సోదరుడు సర్వేశ్వరరావు, మరొకరు బొల్లా నేతాజీల ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ, మృతులకు సంబంధించి మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా సుమారు 54880 మంది: సీఎం జగన్
అందులో రోజూ సరాసరిన కనీసం 90 మంది సాధారణంగానే చనిపోతారు: సీఎం జగన్
ఇలా సాధారణంగా రోజూ 90 మంది చనిపోతే…. జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం @ysjagan గారు
అంతేనా…!!! pic.twitter.com/prbZMJnhrU— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 14, 2022