ఉద్యమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా పాటలు చాలా మార్పులు తెస్తాయని, చాలా ప్రభావితం చూపుతాయని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలోనే స్పష్టమైంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రజలకు పిలుపును ఇస్తూ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
రావాలి జగన్ కావాలి జగన్ అంటూ గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనసేన నుంచి ఇంతవరకు పెద్దగా కదిలించే పాట అయితే రాలేదు. కానీ తాజాగా పార్టీతో సంబంధం లేకుండా ఒక అభిమాని చేసిన మ్యాజిక్ సాంగ్ విపరీతంగా జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటున్నారు.
ఎవరు చేశారో కాని ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఉట్టి పడేలా ఉంది…🙏 pic.twitter.com/2mU4SQu8sC
— Political Missile (@TeluguChegu) November 7, 2022