వచ్చే 2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీనే అధికారం దక్కించుకుంటుందని.. ఏకంగా 114-116 సీట్లలో విజయం సాధించి.. తిరిగి సీఎం సీటును ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటుం దని `జన్ మాట` అనే సర్వే సంస్థ వెల్లడించినట్టు వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనిని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డి కూడా.. ప్రచారం చేశారు. ఇక, వైసీపీఅనుకూల మీడియా దీనికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చింది.
అయితే.. ఇంత ప్రాధాన్యం ఇచ్చిన జన్-మాట సర్వే వ్యవహారంపై అనుమానాలు రేకెత్తడంతో సదరు వార్తల ను అనుకూల మీడియా కూడా ప్రచారం చేయడం ఆపేసింది. దీంతో అసలు ఏం జరిగింది? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు సర్వే చేసినా.. నియోజకవ ర్గాల్లో పరిస్థి తి గందరగోళంగా ఉంది. టికెట్లు కన్ఫర్మ్కాలేదు. పైగా..టీడీపీ-జనసేన అభ్యర్థులను ఇంకా డిక్లేర్ చేయలే దు. అంటే.. పూర్తిస్థాయిలో ప్రజలకు.. తమ తమ నియోజకవర్గాల్లో ఎవరు నిలబడుతున్నారనే విషయంపై క్లారిటీ లేదు.
పైగా.. అంతర్గత కుమ్ములాటలతో వైసీపీ అంతర్మథనంలో ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడిప్పు డే కొనసాగుతోంది. సో.. దీనిని బట్టి.. తాజాగా ఇచ్చిన సర్వే రిపోర్టుపై సందేహాలు నెలకొన్నాయని పరిశీల కులు చెబుతున్నాయి. వాస్తవానికి.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేశారు. జనసేన అధినేత పవన్.. గతానికి భిన్నంగా అన్ని వర్గాలకు చేరువయ్యారు. ఇక, చంద్రబాబును జైల్లో పెట్టడం ద్వారా సింపతీ ఏర్పడింది. ఇక అధికార పార్టీ విషయాన్ని తీసుకుంటే.. సొంత నేతలే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.
అలాకాదు.. వైసీపీ చేసిన మంచి పనులే తీసుకున్నా.. సమాజంలో అందరికీ సంక్షేమ పలాలు అందలే దు. రహదారులు బాగోలేదు. ఉద్యోగుల ఆందోళనలు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి. వలంటీర్లు ఉద్యమాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇలా.. అటు టీడీపీ, ఇటు జనసేన, మరోవైపు వైసీపీల్లోఎక్కడా.. పూర్తిస్థాయి ఎన్నికల సన్నద్ధత లేదు. కానీ, ఇంతలోనే జన్ -మాట పేరుతో సర్వే వెల్లడించడం.. వైసీపీకి జనాలు జై కొడుతున్నారని చెప్పడం వెనుక `ఏదో` ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోనీ.. జన్-మాట సర్వే చేశారని అనుకున్నా.. ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? ఎంత మంది ప్రజలను కలిశారు? ఏయే అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించారు? రాజధాని వ్యవహారం ఏంటి? ప్రజల సమస్యలు ఏంటి? సీఎం జగన్ కు పడిన మార్కులు ఏంటి? ఇలా.. ఏ ఒక్క విషయంపైనా క్లారిటీ లేక పోవడం గమనార్హం. అందుకే.. జన్-మాట సర్వేపై.. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, టీడీపీ నాయకులు ఇది జన్ -మాట సర్వే కాదు.. జగన్-మాట సర్వే అంటూ సటైర్లు వేస్తున్నారు.