దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఆ హాస్టళ్లలోని విద్యార్థుల మధ్యాహ్న, రాత్రిపూట భోజన ఖర్చులతోపాటు ఒకరోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది. దీంతో, వారందరికీ ఊరట లభించినట్లయింది.
ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దని 2020లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, వాటిని పాటించకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇలా ఏపీలో ఐఏఎస్ లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, జైలు శిక్ష విధించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది.
36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఇద్దరు ఐఏఎస్ లు అమలు చేయకపోవడంతో వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఇక, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడంలో కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో గతంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడమే కాకుండా, చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకపోవడంతో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానా విధించడం సంచలనం రేపింది.