కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన పొలిటికల్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఓ రహస్య సమావేశం, శనివారం జరగనున్న కార్యకర్తల సమావేశం నేపథ్యంలో జగ్గారెడ్డి జంపింగ్ చర్చ వినిపిస్తోంది.
రాజకీయ భవిష్యత్తుపై నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమైన జగ్గారెడ్డి వారినుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డిలో తన ముఖ్య అనుచరులు, నాయకులతో రహస్య ప్రదేశంలో నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి ఈమేరకు తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజకీయ భవిష్యత్‌పై శనివారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనికి కారణం సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి భేటి కానుండటం.
గత కొంతకాలంగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీ పెద్దలు ప్టటించుకోవడం లేదనే భవనంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పార్టీ వీడితే టీఆర్ఎస్లోకే అని పలువురు అంచనా వేస్తున్నారు.