ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలవరంపై సభలో వాడివేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పోలవరంలో జాప్యానికి టిడిపి ప్రభుత్వమే కారణమంటూ జగన్ ఆరోపించారు. అంతేకాదు, పోలవరంపై ప్రతిపక్ష నేతగా పోలవరాన్ని ఒక్కసారి కూడా సందర్శించlr జగన్…నిండు శాసనసభలో ఏపీకి జీవనాడి వంటి ఆ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
పోలవరంపై వాస్తవాలు ఇవి అంటూ గణాంకాలు, ఆధారాలతో సహా జగన్ గుట్టురట్టుచేస్తున్నారు. కాపర్ డ్యాం, స్పిల్ వే, అప్పర్ లోయర్, కాపర్ డ్యాం డయాఫ్రం వాల్ లు ఎలాపడితే అలా కట్టడం వల్లే పోలవరానికి భారీ నష్టం జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ప్రాజెక్టు డిజైనింగ్… ఏ నిర్మాణం ఎప్పుడు చేపట్టాలి అన్నది ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా చేతిలోనో, సీఎం చంద్రబాబు చేతిలోనే ఉండదన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర నీటిపారుదల శాఖ, డ్యాం డిజైన్ కమిటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాతే వాటి ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. పోనీ, చంద్రబాబు, దేవినేని ఉమలకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు అనుకుందాం. జగన్ కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థాయి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉందనుకుందాం. మరి, 2019లో జగన్ అధికారంలోకి రాగానే పోలవరం డిజైన్లో మార్పులు ఎందుకు చేయలేదు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇవన్నీ మర్చిపోయిన జగన్ రెడ్డి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్లి 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ తర్వాత ఆ డెడ్లైన్ 2021 డిసెంబర్ కు మారి…అక్కడి నుంచి 2022 ఆ తర్వాత 2023 ఖరీఫ్ అంటూ వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది అని ఎద్దేవా చేస్తున్నారు. పోలవరం 2007లో పూర్తవుతుందని ఆ తర్వాత 2009 అని ఆ తర్వాత 2013 అని వైఎస్ఆర్ కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారు.
ఆయన్నే జగన్ కూడా ఫాలో అవుతున్నట్టున్నారు అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 25 ఏళ్లకు పీపీఏ ఎవరైనా చేసుకుంటారా అని ప్రశ్నించిన జగన్ ఆయన అధికారంలోకి రాగానే 30 ఏళ్లకు పీపీఏ చేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.