అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే….అయ్యయ్యో….ఖజానా ఖాళీ ఆయెనే….ఉన్నది కాస్తా ఊడింది…సర్వమంగళం పాడింది…అప్పులిచ్చే నాథుడు లేక తిరుక్షవరమై పోయింది…వినడానికి కామెడీగా ఉన్న ఈ పేరడీ పాట ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. అయినా కూడా ఏదో వెలితి. అందుకే, ఓటీఎస్ అంటూ సెటిల్మంట్లకు పాల్పడేందుకు కూడా జగన్ సర్కార్ దిగజారింది. దానిపై విమర్శలు వచ్చినా సరే…తగ్గేదేలే అంటోన్న జగన్…తాజాగా ఖజానా నింపుకోవడానికి జగన్ మరో సరికొత్త స్కీమ్ తో జనం నెత్తిన మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు.
జగన్ పాలనలో ఇసుక కొరత, కరోనా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలైంది. ఇక, కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొత్త నిర్మాణాల టెండర్లపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అయితేనేం, వదల బొమ్మాళి వదల…అన్న రీతితో జగన్ కాంట్రాక్టర్లను, బిల్డర్లను, రియల్టర్లను వదలడం లేదు. తాజాగా వారందరికీ షాకిచ్చేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపై ఏపీలో పట్టణ ప్రాంతాల్లో రాబోయే లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులను జారీచేసింది. అది మొదటి ఆప్షన్. ఇక, లేఅవుట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో 5 శాతం భూమిని కొని ప్రభుత్వానికి సమర్పించుకోవచ్చనేది రెండో ఆప్షన్. ఒకవేళ ఈ రెండు ఆప్షన్లు నచ్చకుంటే…ఆ 5 శాతం స్థలం ఖరీదుకు సమానమైన మొత్తాన్ని కలెక్టర్ కు నగదు రూపంలో చెల్లించడం అనేది మూడో ఆప్షన్. ఆప్షన్ లు వేరైనా..రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లకు క్షవరం మాత్రం కామన్.
అయితే, ఈ భారం కేవలం రియల్టర్లు, బిల్డర్లు, లే అవుట్లు వేసేవారు, కాంట్రాక్టర్లపై మాత్రమే పడదు. ఇప్పటికే 10 శాతం సామాజిక అవసరాల కోసం ప్రతి లే అవుట్ లోనూ కేటాయిస్తున్న బిల్డర్లు…ఈ 5 శాతాన్ని కూడా కేటాయించే అవకాశముంది. కాకపోతే ఆ భారమంతా ప్లాట్లు, ఇళ్లు కొనేవారిపై మోపుతారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ భారమంతా ఫ్లాట్లు కొనే మధ్య తరగతి వారిపై పడుతుందంటున్నారు. దీంతో