కృష్ణాజిల్లా హాట్ సీట్లలో ఒకటైన మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ కు జగన్ పెద్ద షాకే ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వసంత ప్లేసులో ఎస్. తిరుపతిరావును ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఎంపికచేశారు. తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం జడ్సీటీసీగా ఉన్నారు. పార్టీలో పూర్తిస్ధాయి నేతగా చాలాకాలంగా తిరుపతి పనిచేస్తున్నారు. వివిధ కోణాల్లో సర్వేలు చేయించుకుంటున్న జగన్ కు తిరుపతికి టికెట్ ఇస్తే పార్టీ గెలుపు ఖాయమని రిపోర్టు వచ్చిందట. తిరుపతిరావు బీసీ(యాదవ్)సామాజికవర్గానికి చెందిన నేత. మామూలుగా అయితే వసంతను ఇక్కడ నుండే పోటీచేయించాలని అనుకున్నారు.
అయితే దాదాపు ఏడాదిన్నరగా వసంతకు జగన్ కు మధ్య గ్యాప్ వచ్చింది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం పెరిగిపోయింది. దాంతో జోగి-వసంత మధ్య చాలాగొడవలయ్యాయి. చివరకు వీళ్ళ పంచాయితీని జగన్ డీల్ చేశారు. పంచాయితీలో భాగంగా జోగికి క్లాసు కూడా పీకారు. దాంతో అప్పటినుండి జోగి మైలవరంలో జోక్యం చేసుకోవటం తగ్గించారు. అయినా ఎందుకనో వసంతకు పార్టీమీద అసంతృప్తి పెరుగుతునే ఉన్నది. దాంతో తరచూ పార్టీకి వసంత దూరంగానే ఉంటున్నారు.
మైలవరంలో వసంతకు టికెట్ క్లియరైనా పోటీచేస్తారనే నమ్మకం జగన్ లో పోయింది. అందుకనే పోటీపై క్లారిటి తీసుకునేందుకు ముఖ్యనేతలు వసంతను చాలాసార్లు పిలిపించారు. పార్టీ ముఖ్యులకు వసంతకు మధ్య జరిగిన చర్చలు ఏమయ్యాయో తెలీదు కాని చివరి నిముషంలో టికెట్ మారిపోయింది. వసంత ప్లేసులో తిరుపతిరావును అభ్యర్ధిగా ప్రకటించారు. అంటే వసంత వైసీపీలో కంటిన్యు అవటం ఇక కేవలం టెక్నికల్ మాత్రమే.
వైసీపీలో కంటిన్యు అయ్యేది కూడా అనుమానమే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. వైసీపీని వదిలేసి తొందరలోనే టీడీపీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాను వైసీపీలోనే ఉంటానని, టీడీపీలో చేరనని వసంత ఖండించినా ఎవరు నమ్మటంలేదు. ఏదేమైనా చివరకు వసంతకు టికెట్ అయితే ఎగిరిపోయింది. మరిక పార్టీలో ఎంతకాలం ఉంటారు ? తిరుపతిరావు గెలుపుకు సహకరిస్తారా ? లేదా అన్నది వెండితెరమీద చూడాల్సిందే. మొత్తానికి జిల్లాలోని హాట్ సీట్లలో ఒకటైన మైలపురం వ్యవహారం చివరకు ఈ విధంగా ముగిసింది.