తండ్రి వైఎస్ ఇమేజ్‌తో సంపాయించుకున్న ఆస్తుల్లో తన నలుగురు మనవళ్లకు సమానంగా ఆస్తులు ఇవ్వాలని.. ఆనాడే వైఎస్ చెప్పారని.. దీనికి జగన్ కూడా అంగీకరించారని.. షర్మిల చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై జగన్ శిబిరం ఎదురు దాడి చేస్తోంది. ఇదంతా చంద్రబాబు కుట్రగా.. ఆయన ఆడిస్తున్న నాటకంగా పేర్కొంటున్నారు. కానీ, దీని వెనుక.. కొంత లోతుగా ఆలోచిస్తే.. జగన్. ఆస్తుల కోసం కంటే. కూడా రాజకీయం కోసం ఇలాచేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే.. షర్మిల వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. నిజంగానే అన్యాయం చేస్తున్నాడని .. జగన్‌పై ఫీలిం గ్ వస్తే.. ప్రజల్లో ఉన్న సానుభూతి కరిగిపోవడం ఖాయం. ఇదే జరిగితే.. ఇప్పటివరకు పేర్చుకుంటూ వచ్చిన సానుభూతి గోడలు కూలిపోతాయి. అందుకే.. వ్యూహాత్మకంగా షర్మిలను ఎదగకుండా చేయడం.. ఆమెను వైఎస్ వారసత్వానికి దూరంగా ఉంచాలన్నది జగన్ నిశ్చయాత్మక భావనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే షర్మిల ఒంటరికాదు.. ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారనేది ప్రొజెక్టు చేస్తున్నారు.
దీనివల్ల.. షర్మిలకు – ప్రజలకు మధ్య వైఎస్ అనే బాండింగ్ ఉండకూడదన్నది ఆయన ఎత్తుగడ. తద్వా రా వైఎస్ సానుభూతి, సింపతి, ఓటు బ్యాంకు అన్నీ కూడా.. వైసీపీకి గుండుగుత్తగా దక్కాలన్నది వైసీపీ అధినేత చేస్తున్న ప్రయత్నం. దీనిలో భాగంగానే షర్మిలను చంద్రబాబు ఆడిస్తున్నారన్న ప్రచారం చేస్తున్నారు. దీనిని నమ్మేలా కూడా చేస్తున్నారు. ఈ రాజకీయ ఉద్దేశమే లేకపోతే.. చంద్రబాబుకు-షర్మిలకు మధ్య సపోర్టు ఉందన్న కామెంట్లు వచ్చే అవకాశం లేదు.
కానీ, తన ఓటు బ్యాంకు బదాబదలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. వైఎస్ కుటుంబ ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్నారన్న వాదన ప్రజల్లో ప్రబలితే.. తన రాజకీయాలకే ముప్పు ఉంటుంది కాబట్టి.. జగన్ చాలా వ్యూహాత్మకంగా.. షర్మిల వెనుక మరొకరు ఉన్నారన్న ప్రచారాన్ని బలంగా చేస్తున్నారని చెబుతున్నారు. అయితే.. దీనిని షర్మిల సాధ్యమైనంత వరకు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నా.. ఈ విషయంలో ఆమె సక్సెస్ అయ్యే తీరును బట్టి.. వైసీపీ వ్యతిరేకతను ఆమె సంపాయించుకునే అవకాశం ఉంటుంది.