కొన్ని కొన్ని విషయాలు చెప్పుకొనేందుకు బాధగా ఉంటుంది. అయినా తప్పదు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన.. నాయకులకు నాయకులకు మధ్య అవినాభావ సంబంధాలు ఉండకుండా ఉండవు. రాజకీయా లు రాజకీయాలే .. వ్యక్తిగతంగా మానవీయ సంబంధాలను పెంచుకున్ననాయకులు ఉన్నారు. ఇదేదో పూర్వకాలంలో మాదిరి రాజకీయాలు కాదు.. నడుస్తున్న చరిత్రలోనే అనేక మంది నాయకులు కనిపిస్తారు.
వీరిలో దివంగత వైఎస్రాజశేఖరరెడ్డికి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఉన్నారు. వీరు బద్ధ శత్రువు లు అని అందరూ అనుకుంటారు. నిజమే అది రాజకీయంగా మాత్రమే. కానీ, వ్యక్తిగతంగా చూసుకుంటే.. మాత్రం స్నేహితులు. ఇటీవల చంద్రబాబు కూడా ఈ విషయం అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయాలను పక్కన పెట్టినప్పుడు.. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్న పరిణామాలు కూడా ఉన్నాయి.
పుట్టిన రోజులు వస్తే.. పరస్పరం.. కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్న పరిస్థితులు కూడా కనిపించాయి. ఇక, కమ్యూనిస్టులు కూడా .. అంతే. రాజకీయాలను రాజకీయాలుగానే చూశారు. వ్యక్తిగత విషయాలకు వస్తే.. మనసు పెట్టి పలకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు.. అందరూ బాధపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఈనాడు వంటి పత్రిక(వైఎస్‌కు ఆజన్మ శత్రువుగా భావించేవారు) కూడా నివాళులర్పిస్తూ.. ఒకే ఎడిటోరియల్ పేజీలో రెండు ఎడిటోరియల్స్ రాసింది!
అయితే.. ఇప్పుడు ఈ మానవ సంబంధాలు తెగిపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ పుట్టిన రోజు చేసుకుంటున్నారు. కానీ, ఆయనకు తన సొంత పార్టీ నేతలు తప్ప.. ఎవరో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు తప్ప.. ప్రధాన నాయకులు కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కానీ, వైఎస్‌తో అనుబంధం ఉన్న తెలంగాణ నాయకులు కానీ.. కనీసం.. ఒక్క శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీనిని ఎలా చూడాలి. జగన్ చేసుకుంటున్న రాజకీయాలే.. ఆయనను మానవీయ సంబంధాలకు కూడా దూరం చేస్తోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.