ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థల దుర్వినియోగం మీద పెద్ద చర్చే నడుస్తోంది. సీఐడీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థను రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపుకే ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఈ మధ్య గట్టిగా వినిపిస్తున్నాయి. రెబల్ ఎంపీగా మారి జగన్ సర్కారు మీద విరుచుకుపడుతున్న రఘురామ కృష్ణంరాజుతో పాటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ టార్గెట్ చేసిన తీరు ఈ విమర్శలకు బలం చేకూర్చింది. కాగా, తాజాగా సీఐడీ చీఫ్ సంజయ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే సోషల్ మీడియా జనాలకు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు.
ఫేక్ ఐడీలతో సీఎం, ఆయన కుటుంబం ప్రతిష్ట దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని పట్టుకునే టెక్నాలజీ తమ దగ్గర ఉందని.. అలాంటి వారిని ఊరికే వదిలిపెట్టమని.. వాళ్ల ఆస్తులు కూడా అటాచ్ చేస్తామని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేయడం ఏంటా అని నిన్నట్నుంచి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అందులో ఆయన.. ‘‘కడుపు మాడి జనాలు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తే తప్పు. వాళ్లను భయపడించే దిశగా కేసులు పెట్టడం. నిజంగా వ్యవస్థను ఇంత దారుణంగా వాడుకునేవారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి అర్హుడా అని గట్టిగా అడుగుతూ ఉన్నా’’ అని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శలు చేసేవారికి మద్దతుగా మాట్లాడిన జగన్.. ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్‌కు సీఐడీ చీఫ్‌తో హెచ్చరికలు చేయించడం ఎంత వరకు సమంజసం..మరీ ఆస్తులు అటాచ్ చేయించడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు గురించి మన జగన్ రెడ్డి పకోడీ మాటలు 😂 pic.twitter.com/o9RSTAZf0N
— I Love India✌ (@Iloveindia_007) November 9, 2023