ఏపీలో కులం చూడం…మతం చూడం…పార్టీ చూడం…నేను అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అంటే ఏంటో చూపిస్తా…అంటూ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మైకులు అరిగిపోయేలా చెప్పిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే…సీఎం జగన్ గా మారిన ప్రతిపక్ష నేత జగన్…తన అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. జగన్ హయాంలో ఏపీలో కుల గజ్జి పెరిగిపోయిందని విమర్శలు వస్తున్నాయి.
గతంలో క్రైస్తవ సోదరులకు సాంత్వన చేకూర్చేందుకు ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా పదవి నుంచి బదిలీ చేశారని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఎల్వీని అవమానకర రీతిలో తొలగించడానికి క్రైస్తవ ప్రార్థనలే కారణమని క్రైస్తవ మత పెద్ద గతంలో వ్యాఖ్యానించడం, ఎల్వీ తొలగింపును సెలబ్రేట్ చేసుకుంటూ కేక్ కటింగ్ చేయడం గతంలో వైరల్ అయింది. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రవీణ్ ప్రకాష్ లను తొలగించిన జగన్….వారి స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించుకొని మరోసారి విమర్శల పాలయ్యారు.
ఇప్పటికే తొలివిడతలో 1111 పదవులు రెడ్లకి ఇవ్వటంతో పాటు, మలి విడతలో కూడా ప్రకాష్,సవాంగ్ ల స్థానంలో రెడ్లను నియమించుకున్నారని రెడ్డి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ గతంలో ప్రకటనలు గుప్పించడం విశేషం. ఇక, గతంలో అమర జవాన్ ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన జగన్…అమర జవాన్లైన జగదీష్, మురళీకృష్ణల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దేశంకోసం పోరాడుతూ ఆ ముగ్గురూ అమరులయ్యారని, అటువంటపుడు వారికి ఇచ్చే ఆర్థికసాయంలో తేడా ఎందుకుందని నెటిజన్లు ట్రోల్ చేశారు.
చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేశారని, ఔట్ ఆఫ్ టర్న్…37 మందిలో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు అని గతంలో జగన్ విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు పెద్దపీట వేశారని ఆరోపణలు గుప్పించిన జగన్…తన రెడ్డి సామాజిక వర్గానికి అంతకన్నా పెద్దపీట వేస్తూ విమర్శల పాలవుతున్నారు. అయినా సరే..జగన్ తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా, ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే వీసీలుగా నియమించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో, జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. మనం చేస్తే సంసారం పక్కవాడు చేస్తే వ్యభిచారం అంటూ జగన్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. అంతేకాదు,26మంది సలహాదారులలో 7గురు రెడ్లే..అంటే మొత్తంలో 27% రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారేనని విమర్శిస్తున్నారు.
ఆ 35 మంది కమ్మ డీఎస్పీలు ఎవరు @YSRCParty ? #FakeFellows pic.twitter.com/nW1UHpMLWI
— iTDP Official (@iTDP_Official) October 25, 2022