అధికారంలో ఉన్న నాయకులపై విమర్శలు కామనే. ఎంత చేసినా.. ఏదో చేయాలనే భావన ప్రజల్లో ఉం టుంది. అది చంద్రబాబు అయినా.. జగన్ అయినా.. ఆఖరుకుఅన్నగారు ఎన్టీఆర్ దిగివచ్చి పాలించినా.. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అనేది కష్టమే. ఈ విషయాన్ని తెలుసుకోలేక పోతే ఇబ్బందులు తప్ప వు. ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగన్ స్లోగన్‌తో వైసీపీ నేతలు ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే.. చాలా చోట్ల ఈ స్టిక్కర్లను వద్దని చెబుతున్నవారి కంటే..(ఏమో ఏం చేస్తారో అని భయం) నాయకు లు అలా వెళ్లిపోగానే.. ఇలా స్టిక్కర్లు పీకేస్తున్నవారు పెరుగుతున్నారు. దీంతో వైసీపీ పరువు,జగన్ పరువు బజారున పడుతోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. తాజాగా కర్నూలులోనూ ఇదే జరిగింది. జగన్.. తనకు ఆత్మీయ బంధువులు ఎవరైనా ఉంటే వారు ముస్లింలేనని పదే పదే చెబుతున్నారు.
అయితే, ఆ ముస్లిం కుటుంబాలే స్టిక్కర్లు పీకేస్తున్నాయని అంటున్నార వైసీపీ కార్యకర్తలు. నవరత్నాల్లో ఒక రత్నమూ తమకు అందలేదని, జగన్‌పై నమ్మకం లేదంటూ ఓ ముస్లిం కుటుంబం తమ ఇంటికి అంటించిన స్టిక్కర్ తీసి వేశారు. కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం, పాలకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ పాలన నచ్చలేదని పేర్కొంటూ ఓ ముస్లిం కుటుంబం నిరసన వ్యక్తం చేసింది.
తమకు పొలాలు, స్థలాలు లేవని.. జగన్‌పై ఉన్న నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమపథకాలు తమకు అందడంలేదన్నారు. కేవలం కుట్టు మిషన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్నారని, తమ కుటుంబ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉందన్నారు.
తమ కుటుంబ పరిస్థితిపై స్థానిక నేతలు, అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, అలాంటప్పుడు ఈ స్టిక్కర్లు ఇంటికి ఎందుకు ఉండాలని వారు ప్రశ్నించారు. దీనిపై ముస్లిం కుటుంబం ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. మరి దీనిపైవైసీపీ అధినేత ఏమంటారో చూడాలి.