ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు వ్యవహారం రాజకీయ దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత ఏడుసార్లు విద్యుత్ చార్జీల పెంచి జనం నెత్తిన పిడుగు వేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనమని, జగన్ ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేస్తున్నారు. జగనన్న హయాంలో స్విచ్ వేయకుండానే షాక్ కొడుతోందని విమర్శిస్తున్నారు.
గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రమాణ స్వీకారం నాడు ప్రకటించిన జగన్ ఈ మూడేళ్లలోనే రూ.42 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఈ విద్యుత్ చార్జీలు చూసి ఏ కంపెనీ కూడా ఏపీకి రాదని, దాని వల్ల నిరుద్యోగం పెరుగుతుందని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు పాలనలో, జగన్ పాలనలో విద్యుత్ కోతలు, మిగులు విద్యుత్, విద్యుత్ చార్జీలు వంటి విషయాలలో పోలిక తెరపైకి వచ్చింది. జగన్ కు, చంద్రబాబుకు ఎంత వ్యత్యాసం ఉందో అన్న విషయాన్ని గణాంకాలతో సహా వెల్లడించి జగన్ గుట్టు రట్టు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలోనే టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసం, కరెంటు విషయంలో గణాంకాలతో టీడీపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో వైరల్ అయింది.
ఏడేళ్ల తర్వాత ఈ కరెంటు సంక్షోభాన్ని ఏపీలో మళ్ళీ చూస్తున్నామని, ఈ విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటో గణాంకాలతో సహా ఆ వీడియోలో వివరించారు. జగన్ చేతకానితనం, మితిమీరిన అవినీతి కారణంగానే అన్ని రంగాలలోనూ రాష్ట్రం అంధకారంలో ఉందని ఆరోపిస్తున్నారు.
2014లో విద్యుత్ రంగంలో 11వేల కోట్ల అప్పు ఉండగా చంద్రబాబు 3 వేల కోట్ల అప్పు తీర్చారని, కానీ, జగన్ మూడేళ్లలో 8800 వేల కోట్ల కొత్త అప్పులు చేశారని విమర్శించారు.
మన రాష్ట్రంలో డిమాండ్ కు మూడు రెట్లు అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, 23 వేల మెగా వాట్లు ఉత్పత్తి చేస్తున్నా విద్యుత్ కొరత ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 2018లో మిగులు విద్యుత్ అమ్మి లాభాలు అర్జించే స్తాయికి చంద్రబాబు వచ్చారని, ఆనాడు ఈ స్థాయిలో కరెంటు కోతలు లేవని అన్నారు. ఇంకా, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్, వారి పాత బకాయిలు మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ రెండు రూపాయలకే విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ పాలనలో ఇండస్ట్రీలకు పవర్ హాలిడే ప్రకటిస్తే…చంద్రబాబు పాలనలో ఇండస్ట్రీలకు సబ్జిడీపై కరెంట్ ఇచ్చారని చెప్పారు.
ఏడేళ్ల తర్వాత ఈ కరెంటు సంక్షోభాన్ని ఏపీలో మళ్ళీ చూస్తున్నాం అన్నమాట సర్వత్రా వినిపిస్తోన్న వేళ… అసలు ఈ విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటో చక్కగా వివరించారు ఈ వీడియోలో. జగన్ రెడ్డి చేతకానితనం, మితిమీరిన అవినీతి కారణంగా అన్ని రంగాలలోనూ రాష్ట్రం అంధకారంలో ఉందంటున్నారు గంగాధర్ pic.twitter.com/0jiR0tfTJf
— Telugu Desam Party (@JaiTDP) April 11, 2022