ఏపీ సీఎం జగన్ కు, కరోనాకు ఉన్న అవినాభావ సంబంధం గురించి సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కరోనా మామూలు జలుబులాంటిదని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాను తరిమేయొచ్చంటూ జగన్ నోటి నుంచి వచ్చిన ఆణిముత్యం వంటి డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, కరోనాతో సహజీవనం తప్పదంటూ జగన్ వదిలిన మరో ఆణిముత్యం ఇంటర్నెట్ లో దుమ్మురేపింది.
ఇక, జనాలు మాస్కు పెట్టకోకపోతే ఫైన్ గా ఫైన్ వేస్తానని చెప్పే జగనన్న మాత్రం మాస్కు పెట్టుకోరంటూ విమర్శలు రావడంతో…ఈ మధ్య కాలంలో జగన్ మాస్కు పెట్టుకొని జనాలకు దర్శనమిస్తున్నారు ఏపీ సీఎం. కరోనా సమయంలో ఈ మాస్కులు, శానిటైజర్లు… నాకెందుకు వచ్చిన గోల అనుకున్న జగన్…తాడేపల్లి ప్యాలెస్ వదిలి అడుగు బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఎవరేమనుకుంటే నాకేం అనుకున్న జగన్ మాత్రం…వర్చువల్ కార్యక్రమాలతో బండి లాగించేస్తున్నారు.
అయితే, సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేయక తప్పదు కాబట్టి…తాజాగా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారు జగన్. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే దాకా అంతా బాగానే ఉంది. ఇక, ఏపీ ప్రజలనుద్దేశించి మాట్లాడాల్సిందిగా జగన్ ను ఆహ్వానించగానే…ఏపీ ప్రజలకే కాదు యావత్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గొప్ప సందేశాన్నిచ్చారు జగన్. నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జగన్ ఇచ్చిన ఈ సందేశం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోందంటే ఆ సందేశం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన జగన్…అప్పటిదాకా అతి కష్టం మీద పెట్టుకున్న మాస్కును…అతి సులువుగా తీసి పడేశారు. అయితే, అప్పటిదాకా కరోనా నుంచి తనకు రక్షణనిచ్చిన మాస్క్ అని చూడకుండా…మాస్క్ పై ఏమాత్రం కనికరం లేని జగన్… అదే మాస్క్ ను కర్చీఫ్ లా భావించి మూతి తుడుచుకున్నారు. దీంతో, మాస్కును ఇలా కూడా వాడవచ్చా అంటూ అక్కడున్న వారితో పాటు…ఆ వేడుకలను లైవ్ చూస్తున్న వారంతా మాస్కు మీద వేలేసుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏ సీఎం, ఏ పీఎం, ఏ దేశాధ్యక్షుడు ఇవ్వలేని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఘనత జగన్ దే నంటూ నెటిజన్లు ఓ పద్ధతి ప్రకారం ట్రోలింగ్ చేస్తున్నారు. మాస్క్ ను ఇలా కూడా వాడతారా…నువ్వు దేవుడివి స్వామి అంటూ మీమ్స్, సెటైర్లు పేలుస్తున్నారు. ఇన్నాళ్లు ఈ టెక్నిక్ తెలీక ఎన్ని కర్చీఫ్ లు కొన్నానో…అంటూ మన్మథుడు సినిమాలో బ్రహ్మి డైలాగ్ తో మీమ్స్ పేలుస్తున్నారు. రాక రాక…ఆర్నెల్ల తర్వాత జనం మధ్యలోకి వచ్చిన వచ్చిన జగన్…మరో 6 నెలలకు ట్రోలింగ్ కు సరిపడా కంటెంట్ ఇచ్చిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్క్ వాడకంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన జగన్…అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.