టీడీపీ హయాంలో నారా లోకేశ్ ను వైసీపీ నేతలు పనిగట్టుకొని మరీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. పొరపాటున ఏదో ఫ్లోలో దొర్లిన తప్పును పదే పదే రిపీట్ మోడ్ లో ప్లే చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు వైసీసీ కార్యకర్తలు. అయితే, కాలం ఒకేలా ఉండదు…జగన్ కూడా దొరకక మానడు అంటూ అవకాశం కోసం ఎదురుచూశారు టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వింగ్ కు ప్రస్తుతం జగనన్న నోటి నుంచి జాలువారుతున్న ఆణిముత్యాలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. కొత్త జిల్లాల సందర్భంగా జగన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తే నవ్వాపుకోవడం అసాధ్యం.
తాలిబన్లు సైతం రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో సమాధానం చెప్తున్నారని, కానీ, చరిత్రలో పొరపాటున మీడియాకు లైవ్ లో కనబడకుండా రికార్డెడ్ వీడియోని లైవ్ లాగ బిల్డప్ ఇచ్చే సీఎం జగనన్నేనని ట్రోలింగ్ జరుగుతోంది. లక్షల కోట్లు అప్పులు చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ లో పులివెందుల పిల్లి జగన్ బటన్ నొక్కుతూ సిగ్గుపడతాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఊర్ల పేర్లు చదువుతూ జగన్ పలికిన భాష ఏదైతే ఉందో…అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
రాజమహేంద్రవరాన్ని “రాజమహేంద్ర వర్మ” అంటూ జగన్ మరో ‘జ్ఞానగుళిక’ను అందించారని నెట్టింట టీడీపీ ట్రోల్ చేస్తోంది. ప్రసంగాలలో జగన్ తడబాటుకు గురికావడం కొత్త కాదు..కానీ ఒక ఊరు పేరును కూడా సరిగా పలకలేకపోవడంతో టీడీపీ వాళ్లు పంచ్ లు వేస్తున్నారు. ఇక నుండి ‘రాజమహేంద్ర వరం’ అంటే నెటిజన్లు మాత్రం ‘రాజమహేంద్ర వర్మ’ అని మాత్రమే అనే విధంగా సోషల్ మీడియాలో జగన్ రెడ్డి వాయిస్ వినపడుతోంది.
గుంటూరుకి ‘గుండూరు’ అని, హిందూపురాన్ని ‘సింధుపురం’ అని, విశాఖని ‘ఉషాక’ అని, టెక్కలిని ‘టెక్కిలి’ అని, నవులూరుని ‘నలుగులూరు’ అని జగన్ వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని కూడా ఏకిపారేస్తున్నారు. ‘కొట్టారు తీసుకున్నాం, మాకు టైం వస్తది, మేము కొడతాం’ అంటూ సినీ ఫక్కీలో గతంలో జగన్ చెప్పిన డైలాగ్స్ ను ‘వైసీపీ అండ్ కో’కు అప్పచెప్పే పనిలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే కదా జగన్ చెప్పే ‘దేవుడి లీల!’ అంటూ నత్తి పకోడీ జ్ఞాన గుళికల పేరుతో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా…శంకర్ దయాల్ శర్మ…బంగాళ దుంపల ఖుర్మా…రాజమహేంద్ర వర్మ…ఆంద్రప్రదేష్ ఖర్మ అంటూ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. అంత:కవి జమోరె(జగన్ మోహన్ రెడ్డి) రాసిన ఆణిముత్యాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.