టీడీపీ హయాంలో నారా లోకేశ్ ను వైసీపీ నేతలు పనిగట్టుకొని మరీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. పొరపాటున ఏదో ఫ్లోలో దొర్లిన తప్పును పదే పదే రిపీట్ మోడ్ లో ప్లే చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు వైసీసీ కార్యకర్తలు. అయితే, కాలం ఒకేలా ఉండదు…జగన్ కూడా దొరకక మానడు అంటూ అవకాశం కోసం ఎదురుచూసిన టీడీపీ నేతలకు జగన్ బోలెడు అవకాశాలిచ్చారు..ఇస్తూనే ఉన్నారు.
కొత్త జిల్లాల ప్రారంభోత్సవ ప్రకటన సందర్భంగా రాజమహేంద్రవరాన్ని “రాజమహేంద్ర వర్మ” అంటూ జగన్ మరో ‘జ్ఞానగుళిక’ను అందించారని కొద్ది రోజుల క్రితం ట్రోలింగ్ జరిగింది. తన ప్రసంగాలలో జగన్ తడబాటుకు గురికావడం కొత్త కాదు..కానీ ఒక ఊరు పేరును కూడా సరిగా పలకలేకపోవడంతో టీడీపీ వాళ్లు పంచ్ లు వేస్తున్నారు. ఇక, గుంటూరును ‘గుండూరు’ అని, హిందూపురాన్ని ‘సింధుపురం’ అని, విశాఖని ‘ఉషాక’ అని, టెక్కలిని ‘టెక్కిలి’ అని, నవులూరుని ‘నలుగులూరు’ అని జగన్ వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ గర్భం దాల్చిన చెల్లెమ్మలను అని చెప్పబోయి…గర్వం దాల్చిన అనేయడంతో జగన్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. గర్వానికి…గర్భానికి కూడా తేడా తెలీని సీఎం అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. జగన్ కు సరిగ్గా తెలుగు రాదు…ఇంగ్లిష్ అంతకన్నా రాదు అంటూ ఏకిపారేస్తున్నారు. జగన్ తో పోలిస్తే లోకేష్ బెటర్ అని అంటున్నారు. తెలుగు మాట్లాడడంలో లోకేష్ చాలా మేలని కితాబిస్తున్నారు.
‘కొట్టారు తీసుకున్నాం, మాకు టైం వస్తది, మేము కొడతాం’ అంటూ సినీ ఫక్కీలో గతంలో జగన్ చెప్పిన డైలాగ్స్ ను ‘వైసీపీ అండ్ కో’కు అప్పచెప్పే పనిలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే కదా జగన్ చెప్పే ‘దేవుడి లీల!’ అంటూ నత్తి పకోడీ జ్ఞాన గుళికల పేరుతో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘తేట’ తెలుగు ‘తాట’ తీస్తున్న జగన్ వీడియో చూస్తే నవ్వాపుకోలేరంటూ ఎద్దేవా చేస్తున్నారు.
https://youtu.be/fv0wuHMGNgw