ఏపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా.. భారీ సంఖ్యలో నామినే షన్లు దాఖలయ్యాయి. ఇక్కడ నుంచి పోటీకి 48 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఒకరిద్దరు రెండేసి చొప్పున దాఖలు చేశారు. దీంతో మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 32 నామినేషన్లు ఇక్కడ దాఖలైనట్టు ఎన్నికల సంఘం వెబ్ సైట్లో పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏకంగా 30 నామినేషన్లు దాఖలు చేశారు.
అలాగే.. టీడీపీ యువ నేత, నారా లోకేష్ పోటీలో ఉన్న మంగళగిరి నుంచి ఎవరూ ఊహించని రీతిలో 72 నామినేషన్లు దాఖల య్యాయి. వీటిలో చిన్నా చితకా పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. మెజారిటీ సంఖ్యలో ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే.. ఈ నెల 26న(శుక్రవారం) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తేడా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘమే వీటిలో కొన్నింటిని తొలగించే అవకాశం ఉంది. లేదా.. పార్టీలు రంగంలోకి దిగి.. ఇండిపెండెంట్లను బుజ్జగించినా.. వారు తప్పుకొనే అవకాశం ఉంది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు.. 4,210 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా 25 లోక్ సభ స్థానాలకు 731 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వేశారు. మరి ఎంత మంది అంతిమం దాకా ఉంటారోచూడాలి.