• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్…ఇకపై వారికి ఏపీలో ఆ పెన్షన్ ఇవ్వరట

ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాల్సిందేనంటూ కొత్త నిబంధన

admin by admin
September 1, 2021
in Uncategorized
0
jagan
0
SHARES
414
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తాము అధికంగా పెన్షన్ ఇస్తున్నామని వైసీపీ సర్కార్ గొప్పలు చె్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది అర్హులైన వారి పెన్షన్లు తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. తమ భర్తలు బ్రతికే ఉన్నా…చనిపోయారని కొంతమంది మహిళలు అబద్ధం చెప్పి వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని, అటువంటి వారి పెన్షన్లు తొలగించామని ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లి మరీ వాదించింది.

ఇక, ప్రతి ఏటా పెన్షన్ లు పెంచుకుంటూ………….పోతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్…ఒకసారి రూ.250 పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పెన్షన్ రూ. 250 పెంచాలని, కానీ, అలా జరగడం లేదని జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వృద్ధాప్య పెన్షన్ దారులకు జగన్ షాకిచ్చారు. ఇకపై నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఉండవని, ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోకుంటే మురిగిపోయినట్లేనని చావుకబురు చల్లగా చెప్పారు.

అంతేకాదు, పెన్షన్ లపై తెచ్చిన కొత్త నిబంధన సెప్టెంబర్ 1నుంచి అమలు చేస్తున్నామని ముందస్తు ప్రకటన కూడా లేకుండా జనాలకు షాకిచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా నివామసముంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. వాస్తవానికి పెన్షన్ దారులు ఏదైనా కారణంతో ఆ నెల పెన్షన్ తీసుకోకుంటే…తర్వాతి నెలలో బకాయితో కలిపి పెన్షన్ ఇస్తున్నారు.

అయితే, కొందరు పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా నివాసముంటూ మూడు, నాలుగు నెలలకోసారి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో, వారికి చెక్ పెట్టేందుకే ఏనెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలని, బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. అంతేకాదు, జూలై, ఆగస్టు నెలల్లో పెన్షన్ డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఆ రెండు బకాయిలను ప్రభుత్వం మంజూరు చేయలేదు.

కేవలం సెప్టెంబర్‌ నెల పెన్షన్ కు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏపీలో 60 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులుండగా..ప్రతి నెలా 2 లక్షల మందికి పైగా నెలనెలా పెన్షన్ తీసుకోవడం లేదు. దీంతో, పెన్షన్ తీసుకోని వారంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటున్నారని అధికారులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా ఇలా నిబంధనలు విధించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇలా చేయడం వల్ల నిజంగా ఏదైనా అనారోగ్య కారణాలతో వేరే రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నవారు తమ పెన్షన్ హక్కును కోల్పోవాల్సి వస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనపై కనీసం మూడు నెలలు ప్రచారం చేసిన తర్వాత పెన్షన్ బకాయిలు నిలిపివేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇపుడు కొంతమంది కోసం విధించిన నిబంధన చాలామందికి ఇబ్బందిని కలిగిస్తోందని పలువురు పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags: jagan shocker to pensionersnew rule on old age pensionsold age pensionspension arrearspensioners suffering
Previous Post

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య…నిందితుడెవరంటే…

Next Post

విజయమ్మ ప్లాన్ అట్టర్ ఫ్లాపేనటగా

Related Posts

Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Uncategorized

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

January 21, 2023
Uncategorized

గుంటూరు మృతుల కుటుంబాలకు 10,00,000( పది లక్షల రూపాయలు) ఆర్ధిక సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ!

January 21, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

పవన్ పై మోడీకి చాడీలు

January 17, 2023
Top Stories

యువతిని 12 కి.మీ ఈడ్చుకెళ్లారు…ఘోర ప్రమాదం

January 2, 2023
Load More
Next Post

విజయమ్మ ప్లాన్ అట్టర్ ఫ్లాపేనటగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత
  • కల్యాణ్ రామ్ ‘అమిగోస్’…అదిరింది!
  • సచివాలయంలో అగ్నిప్రమాదం? షర్మిల, పాల్ సెటైర్లు
  • వివేకా కేసు..సజ్జల భలే కవర్ చేశాడే!
  • పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్
  • నెల్లూరు రెబల్స్ ఎపిసోడ్ పై రఘురామ కామెంట్స్
  • ఎన్ కౌంటర్ చేస్తేనే నా నోరు మూతపడుతుంది:కోటంరెడ్డి
  • సోము మళ్లీ ఏసేశాడుగా.. ఈసారి జనసేనాని టార్గెట్
  • కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?
  • శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?
  • కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్
  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra