కొత్త జిల్లాల పేరుతో జగన్ పదవుల పందేరానికి తెరతీశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడమే రహస్య ఎజెండాగా జిల్లాలను విభజించిన జగన్….రాబోయే సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత నియోజవర్గాల పునర్విభజన నేపథ్యంలోనే ఈ పనికి పూనుకున్నారని ప్రచారం జరుగుతోంది. పోనీ, ఆ జిల్లాలనైనా సవ్యంగా విభజించారా అంటే అదీ లేదంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలవరం నిర్వాసితుల్ని జగన్ ఘోరంగా మోసం చేశారని, జిల్లా కేంద్రాన్ని 300 కిలోమీటర్ల దూరంలో పెట్టారని జనసేన అధినేత పవన్ ఆరోపించారు. వారు తమకు రావాలసిన ముంపు చేసి పరిహారం కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ తప్పును సరి చేస్తామని పవన్ లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలోనే పవన్ లేఖ రాసిన 24 గంటల్లో మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.
ఏపీలోని మన్యం ప్రాంతంలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని మంత్రి పేర్ని నాని స్వయంగా ప్రకటించారు. దాని గురించి జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని కూడా నాని చెప్పారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటుగా రంపచోడవరం, చింతూరు, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి గిరిజన ప్రాంతంలోనే మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేక్రమంలో మరో జిల్లాను కూడా ఏర్పాటు చేస్తే పాలన మరింత సులభతరమవుతుందని అన్నారు. నాని చెప్పినట్లు జరిగితే ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 27 జిల్లాలు అవుతాయి. ప్రస్తుతానికి 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అదే జరిగితే మొత్తం సెంచరీ కొట్టే అవకాశముంది. అయితే, పవన్ చెప్పిన పనిని జగన్ వెంటనే చేశారని, ఈ విషయం పవన్ చెప్పేదాకా జగన్ కు తెలియకపోవడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.