చంద్రబాబు తనలో కొత్త మనిషిని చూపించారు. నువ్వొక ఫేక్ ఫెలో, నీదో ఫేక్ మీడియా అంటూ జగన్ పై, సాక్షిపై నిప్పులు చెరిగారు. నేను అవినీతి చేశాను అన్నారు. ఏడాదిన్నర పాటు మీరు ఏం చేశారు? గాడిదలు కాశారా? ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు అంటూ చంద్రబాబు ఫైరయ్యారు.
కమిటీలు వేసి ఎందుకు మా అవినీతిని నిరూపించలేదు అని చంద్రబాబు జగన్ రెడ్డిని నిలదీశారు. మీ సాక్షిలో పోలవరంపై ఇదేమి అంచనా ఒక వార్త రాశారు. ఇపుడు మీకు అదే అంచనా ముద్దొచ్చిందా అని నిలదీశారు. ఫేక్ న్యూస్ తోనే బతుకుతున్నావు, ఈ పేపరు ఒక ఫేక్ మీడియా అంటూ సాక్షి పేపరు చూపించి దునుమాడారు.
అవినీతి చేసిన పోలవరం కాంట్రాక్టరుకు మళ్లీ మీరెందుకు కాంట్రాక్టరు ఇచ్చారు. అంటే ఇంతకాలం మీరు చేసిన ప్రచారం అబద్ధం కాదా? ఆరోపణలు చేసి అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఎలా మళ్లీ అతనికే కాంట్రాక్టు ఇచ్చారు అని చంద్రబాబు నిలదీశారు.