జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను గత శుక్రవారం నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ వేగవంతం చేసింది. ప్రజాప్రతినిధుల కేసులను స్పీడుగా తేల్చడంలో భాగంగా జగన్ కేసులు ఇపుడు టకటకా విచారణకు రానున్నాయి. ఇప్పటికే సీబీఐ, ఈడి చర్టుల్లో ఉన్న జగన్ కేసుల విచారణ కూడా వేగవంతమైంది. జగన్ పై నమోదైన మొత్తం 11 కేసులను సీబీఐ కోర్టు, ఈడి కోర్టులో ఉన్న మరో 5 కేసులను వేగంగా విచారిస్తున్నారు.
శుక్రవారం తర్వాత విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు కొంత విచారణ జరిగాక రేపటికి వాయిదా వేశారు. మరోవైపు హైకోర్టులో ఉన్న మరికొన్ని కేసులను వచ్చే నెల 9 నుంచిరోజూవారీగా విచారిస్తారు. దసరా వరకు అన్ని కేసులు విచారణ వాయిదా వేయాలని జగన్ రెడ్డి చేసిన రిక్వెస్టులను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
విచిత్రం ఏంటంటే.. కరోనా తో కలిసి జీవించమని జనాల్ని రిక్వెస్టు చేసిన ముఖ్యమంత్రి తాను మాత్రం కరోనా వైరస్ కారణంగా కోర్టుకు హాజరుకాలేను, దసరా తర్వాత విచారణకు అవకాశం ఇవ్వండి అని అర్జీ పెట్టుకోవడం ఒక విచిత్రం. ఏదో ఓ సాకు చూపి విచారణను మరికొద్ది రోజులు వాయిదా వేయిద్దామని జగన్ తరపు లాయర్ చేసిన ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది.
చట్టసభల్లో నేరచరితులను ఏరి పారేసే లక్ష్యంతో సుప్రింకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో జగన్ లాంటి వారందరి కేసుల చిట్టా విప్పుతోంది. ప్రజా ప్రతినిధులపై ఏపిలో సుమారు 150 మందిపై కేసులున్నాయి. ఇందులో తాజా, మాజీ ఎంఎల్ఏల, ఎంపిలున్నారు.