జగన్ సర్కారు తన గుజరాతీ బాస్ ను మెప్పించడానికి అముల్ కంపెనీకి ప్రభుత్వ వ్యయంతో ప్రచారం చేస్తున్నారు. అందరి కంటే రైతులకు 4 రూపాయలు ఎక్కువ ఇస్తున్న సంగం డైరీపై అదేపనిగా కక్ష కట్టి రైతులను నష్టపరిచే ప్రయత్నం చేశారు. . జగన్ రెడ్డి ఓ అమూల్ బేబీ అని, ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.
జగన్ రెడ్డికి అధికారం అంటే… టీడీపీపై కక్ష తీర్చుకోవడానికి వాడటమే తెలుసు అని నారా లోకేష్ ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదలైన ధూళిపాళ నరేంద్రను లోకేష్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు .
నరేంద్ర ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందిస్తున్నారు. ఇది ప్రతి రైతుకు తెలుసు. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. పాడి పరిశ్రమను గుజరాత్‌కు అమ్మేందుకు కుట్ర చేస్తోందని లోకేష్ ఆరోపించారు.
ఒంగోలు డెయిరీని ఇప్పటికే అమూల్‌కు అప్పగించారని, ఇంకా అమూల్ కోసం వ్యవస్థను మొత్తం వాడుతున్నారని లోకేష్ అన్నారు. ప్రజల కరోనా నుంచి మమ్మల్ని కాపాడమని జగన్ ని అడుగుతుంటే … ఆయన గుజరాత్ వ్యాపారులను కాపాడే పనిలో బిజీగా ఉన్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.