ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇటీవల కాలంలో రికార్డులు సృష్టిస్తున్న గూగుల్ సెర్చ్ ఇంజ న్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. గతంలో జగన్ ఢిల్లీ పర్యటన చేసినప్పుడుఅక్కడ ఏం చేశారు? ఎవరితో ఆయన మాట్లాడారు? అనే విషయాలపై సెర్చ్ ఇంజన్లో భారీ సంఖ్యలో నెటిజన్లు ప్రశ్నించారు. ఇదినిముషానికి వెయ్యిగా రికార్డు అయింది. తెలుగు మాధ్యమాల్లోనూ ఇది ప్రధాన వార్తగా వచ్చింది. అయితే.. ఇప్పుడు దీనికి మించిన మరో అంశం గూగుల్ సెర్చ్ ఇంజన్లో హల్చల్చేస్తోంది.
గడిచిన రెండు రోజులుగా సెర్చ్ ఇంజన్లో జగన్ గురించి నెటిజన్లు ఎక్కువగా సంధిస్తున్న ప్రశ్న ఇదే.. అదేంటంటే.. జగన్ ఎవరికైనా భయపడుతున్నారా ? జగన్ బెయిల్ రద్దు అవుతుందా ? ఈ రెండు ప్రశ్నలే ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో టాప్ పొజిషన్ లో ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అమరావతి రాజధాని ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమం ప్రారంభించి 550 రోజులు అయింది. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సీఎం ఇంటి ముట్టడికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ముందుగానే నిఘా వర్గాలకు చేరిపోయింది.
మరోవైపు విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇటీవల మంత్రి బొత్స కూడా ప్రకటించారు. దీంతో రాజధాని రైతులు, మహిళలు మళ్లీ అమీతుమీకి రెడీ అయ్యారు. దీంతో జగన్ ఏక్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో ఉన్నారని.. ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్‌పై త్వరలో తీర్పు రానుంది. బెయిల్ రద్దయితే.. నెక్ట్స్ ఏం చేయాలనే విషయంపైనా ఆయన తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే జగన్ భయపడుతున్నారని.. బెయిల్ రద్దు, విశాఖకు రాజధాని తరలింపు అంశాలు ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయని ప్రత్యర్థి పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో జగన్ విషయంలో ఆ రెండు ప్రశ్నలు ఇప్పుడు హల్చల్ చేస్తుండడంతో గూగుల్ సరికొత్త రికార్డు నమోదు చేసిందట.