ఏపీ రాజధాని అమరాతిపై తనకు కోపం లేదంటూ.. ముఖ్యమంత్రి జగన్.. చేసిన కామెంట్లు మరోసారి.. ట్రోల్ అవుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో ఆయన అమరావతిపై.. చర్చ జరిగింది. మూడు రాజధానులు ఎందుకు కోరుకుంటున్నామో.. చెబుతూ.. సీఎం జగన్.. తనకు అమరావతిపై కోపం లేదన్నారు. అయితే.. కోపం లేనప్పుడు.. ఈ కాలరాసుడు.. విధానాలు ఏంటనేది.. నెటిజన్ల ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై శాసనసభలో సుధీర్ఘంగా ప్రసంగించారు.
పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి కోసం వెయ్యి రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమమని కొట్టిపడేశారు. ఇతర ప్రాంతాల వారి మనోభావాలను రెచ్చగొట్టేలా ఉద్యమం నడుస్తోందని ఆరోపించారు.
పెత్తందార్లు, పెట్టుబడిదారుల కోసం ఉద్యమం పనిచేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుహయంలో 31 లక్షల ఇళ్ళపట్టాలు, 21 లక్షల ఇళ్ళ నిర్మాణం ఏమయ్యాయని ప్రశ్నించారు.
‘అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో భాగంగా కర్నూలు, విశాఖలను యాడ్ చేయాలనుకున్నా. రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చంద్రాబాబే చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పదవీకాలంలో గ్రాఫిక్స్ చూపించి జనాన్ని మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రూ. 2290 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. అమరావతి రాజధాని అనేది ఓ స్వప్నాల వేట మాత్రమే… ఇది వందేళ్ళయినా పూర్తికాదు.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
మరి.. ఇది నిజమే అయినప్పుడు.. అప్పట్లో విపక్షంలో ఉన్నప్పుడు.. జగన్.. ఎందుకు ఈ `లా` పాయింట్లు లేవనెత్తలేదు? అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు.. ప్రతి విషయాన్ని ఇంత కూలంకషంగా అప్పట్లో ఎందు కు ఆయన ప్రస్తావించలేదు. గ్రాఫిక్స్ అయితే.. ఇప్పుడు ఉన్న.. నిర్మాణాలు ఏంటి? జరిగిన అభివృద్ధి ఏంటి? అనేది కూడా జగన్ వివరించి ఉంటే బాగుండేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయంలో నూ.. జగన్ చేస్తున్న వ్యవహారం.. అమరావతిని కాల రాసేలా ఉందని.. సాక్షాత్తూ.. రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం నెటిజన్లు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
`ఎవరో.. మంగళవారం అన్నట్టుగా` చెప్పుకొనే సామెత.. జగన్ విషయంలో నిజమవుతోందని.. నెటిజన్లు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలతో జగన్ మరోసారి ఇరుకున పడుతున్నారనే వ్యాఖ్యలు వైసీపీ నేతల్లోవ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మూడు రాజధానులపై సెంటిమెంటు లేదనేది.. గతంలో తిరుపతికి రైతులు చేసిన పాదయాత్రలో స్పష్టమైంది. ఇప్పుడు మలి విడతలోనూ.. ఎక్కడా మూడు రాజధనుల సెంటిమెంటుకు అనుకూలంగా సాధారణ ప్రజలు ఎవరూ.. స్పందించడం లేదు., ఈ పరిణామాల నేపథ్యంలో జగన్పై నెటిజన్లు చేస్తున్న కామెంట్లు చర్చకు వస్తున్నాయి.