ఏపీలో రాజకీయ పరిణామాలు ఎంత హాట్ హాట్ గా మారిపోయా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు రూ. 371 కోట్ల అవినీతి స్కాంలో నిందితుడుగా పేర్కొంటూ జగన్ ప్రభుత్వం తెల్లవారిన అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సహజంగానే సొంత పార్టీ నేతలు, ప్రతిపక్షాలు ఈ అంశంపై తమదైన శైలిలో స్పందిస్తున్నాయి ఈ క్రమంలో ఇద్దరు యువనేతల ప్రస్తావన తెర మీదకు వస్తోంది. మరో ఇద్దరు ప్రభుత్వానిధేతల లాజిక్ మిస్ అయిందనే టాక్ నడుస్తోంది.
ఇద్దరు యువనేతల విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కాగా, ఇద్దరు ప్రభుత్వ రథసారథులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. దేశంలోని కీలక ప్రాంతాలు అన్నింటా సాగేలా రాహుల్ పాదయాత్ర చేశారు. గత వారంలోనే ఈ పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకుంది కూడా. మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు
ఈ ఇద్దరు నేతను చేసిన చేస్తున్న యాత్రల కంటే వారి ప్రత్యర్థులైన అధికారంలో ఉన్న నేతల చర్యలతో ఎక్కువ ఫలితం దక్కిందని అంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనంతరం ఓ కోర్టు తీర్పు ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం వెలువడింది. దీని వల్ల భారత్‌జోడో యాత్రలో సాధఙంచిన మైలేజీ కంటే ఎక్కువ మైలేజీని రాహుల్ పొందగలిగారు. సహజంగానే ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ టార్గెట్ అయింది. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి చేపడుతున్న కార్యక్రమాల కంటే, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం కారణంగా చంద్రబాబు అరెస్టు అవడం ఎక్కువగా చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడిగా పేర్కొంటూ చంద్రబాబును తాజాగా అరెస్టు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మైలేజ్ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా జగన్ పగ నెరవేరి ఉండొచ్చు అనే భావన ఉన్నప్పటికీ అదే సమయంలో చంద్రబాబు ఆయన తన కార్యక్రమాల రూపంలో ప్రజల్లో తిరుగుతున్న దానికంటే ఈ అరెస్టుతోనే ఎక్కువ మైలేజీ వచ్చి ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దారిలోనే వెళ్లి తన రాజకీయ ప్రత్యర్థిపై నిర్ణయం వెలువరించిన జగన్ మైలేజీ విషయంలో మాత్రం లెక్కలు మర్చిపోయారనే టాక్ వస్తోంది.