సొంత బాబాయి. తండ్రి తమ్ముడు.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యను.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఏమార్చుతున్నారా? ఇంకా.. చంద్రబాబుపైనే నెపం నెట్టాలని చూస్తున్నారా? అంటే.. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎంగా జగన్ చేసిన వ్యాఖ్యలను విన్నవారు.. ఔననే అంటున్నారు. గత 2019 ఎన్నికలకు ముందు.. మార్చిలో 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అయితే.. అప్పట్లో ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ.. జగన్ సొంత మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత.. చాలా సేపటికి అన్ని చానెళ్లు మొత్తుకున్న తర్వాత.. దీనిని హత్య అంటూ.. ప్రసారం చేశారు.
ఇక, అదే రోజు సాక్షిమీడియా .. `నారాసుర హత్య` అంటూ పెద్ద ఫొటోతో ఈ పాపాన్ని చంద్రబాబుకు అంట గట్టే ప్రయత్నం చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆయనే హత్య చేయించారని.. ఇటు జగన్ .. అటు ఆయన మీడియా కూడా పెద్ద ఎత్తున నిందలు మోపాయి. అయితే.. వాస్తవానికి అప్పటికే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో చంద్రబాబు టెక్నికల్‌గా మాత్రమే ముఖ్యమంత్రి. మొత్తం వ్యవహారం అంతా కూడా.. ఎన్నికల సంఘం.. ఆ సంఘం నియమించిన అధికారులు, పోలీసులు చూసుకున్నారు. అయినప్పటికీ.. చంద్రబాబు ఒక కమిటీని నియమించారు.
అయితే.. ఆ సిట్‌పై తనకు నమ్మకం లేదని.. సీబీఐకి ఇవ్వాలని..ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఆయన కోర్టులోనూ.. పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అధికారంలోకి రాగానే .. ఆయన ప్లేట్ ఫిరాయించారు. కోర్టులో దాఖలు చేసిన.. సీబీఐ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. మరి చంద్రబాబు చేయించి ఉంటే.. సీబీఐ పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది ఇప్పటికీ.. ఆయన చెప్పలేదు. తాజాగా ఆయన ఎలాగూ నోరు విప్పారు కనుక.. వివేకా హత్య విషయంలో తాను ఏం చేశారనేది చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు పరిశీలకులు.
ఇక, వివేకా కుమార్తె..ఈ హత్య వెనుక వైఎస్ కుటుంబసభ్యులే ఉన్నారని బహిరంగంగా పేర్కొన్నారు. అంతేకాదు.. అనుమానితుల జాబితాను ఆమెకు సీబీఐకి అందించినప్పుడు కూడా.. వీరిలో వైఎస్ కుటుంబానికి చెందిన వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాశ్‌రెడ్డి తండ్రి పేరు ఉంది. అదేవిధంగా ప్రస్తుతం సీబీఐ.. అరెస్టు చేసిన శివశంకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. మరి ఇంత జరిగితే.. అందునా.. తనకు వరుసకు చెల్లెలయ్యే.. వివేకా కూతురే.. వైఎస్ కుటుంబం ఉందని ఆరోపిస్తే.. ఈ విషయాన్ని పక్కదారి పట్టించి. చంద్రబాబు ఉన్నారు.. ఆయన హయాంలోనే జరిగింది కనుక, ఆయనే చేయించారని అనడం.. ఏమార్చడం కాక మరేంటని అంటున్నారు ప్రజలు.