కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం జగన్.. అనేక విషయాలపై ఆయన విన్నపాలు సమర్పించారు. వాస్తవానికి పీఎం దగ్గరే ఆయా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినా.. ఆయన సూచనల మేరకు.. వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రధానంగా హోం మంత్రి ముందు జగన్ తన విన్నపాల చిట్టాను విప్పారు. మేము ఇన్ని చెబుతుంటే మీరు ఫొటోలో అమిత్ కాలు ఎటువైపు పెట్టారు అని పరిశీలించడం భావ్యం కాదు. ఏపీ కోసం అధికారికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమడిగారు అన్నది కింద మీరు చదువుకోవచ్చు.
+ తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యు) ఏర్పాటు. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ… రుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలి.
+ విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని వాటిని పరిష్కరించాలని విన్నపం.
+ 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని మంజూరు చేయాలని కోరిన సీఎం.
+ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం.
+ తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రికి విన్నపం.
+ నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుంది.
+ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
+ రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలని వినతి.