ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరితో రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం జరగగా..ఈ రోజు అంటే ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఆ జంట నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్…వారి పెళ్లికి మాత్రం హాజరు కావడం లేదని తెలుస్తోంది.
షర్మిలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తుండగా…వైసీపీ నేతలతోపాటు జగన్ ను కూడా షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ఆ కారణంగానే సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్లోద్దని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను వ్యక్తిగత దూషణలు చేయడం లేదని, సిద్ధాంతపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నానని గతంలో షర్మిల వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.