తూర్పుగోదావరి జిల్లా కోనసీమపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అంటే.. అందానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఇక్కడి వారి మనసులు కూడా అంతే అందంగా ఉంటాయని చెప్పారు. పి.గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్తానిక అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు. కోనసీమ ప్రజలు మంచినీళ్లు అడిగితే.. కొబ్బరి నీళ్లు ఇస్తారని కొనియాడారు. అలాంటి కోనసీమను ఈ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి .. కశ్మీర్ చేశాడని దుయ్యబట్టారు.
తమ హయాంలో కోనసీను పచ్చని సీమగా మార్చామని.. కానీ, ఈ సీఎం మాత్రం ఇక్కడ ఇళ్లను తగలబె ట్టించి.. జిల్లాల విభజన పేరుతో చిచ్చు పెట్టాడని విమర్శించారు. ఆ మంటలు ఇంకా ఆరలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. కోన సీమ ప్రజల డిమాండ్ల మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే.. మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూడా పరిశీలిస్తామని చెప్పారు. “కోనసీమ పేరు చెబితే.. అందమైన కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలతో పాటు.. అంతే అందమైన మనసున్న వ్యక్తులు కనిపిస్తారు“ అని అన్నారు.
అలాంటి కోనసీమను ఈ సీఎం జగన్ ఇంటర్నెట్ ఆపేసి.. ఇళ్లు తగలబెట్టించి కశ్మీర్‌ను చేశారని చంద్రబా బు మండిపడ్డారు. పౌరుషం, కొట్లాటలు కూడా తెలియని కోనసీమలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కక్ష లు, పగలు పెరిగిపోయాయని అన్నారు.తాము వచ్చాక.. పరిస్థితులును చక్కదిద్దుతామని చెప్పారు. కోనసీమ ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. నేరుగా రీచ్‌లకు చేరుకుని ఇసుకను తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.
జగన్.. కుల రాజకీయాలు చేసి చిచ్చు పెట్టాలని చూస్తే, అందులో దహనం అయ్యేది నువ్వే..#PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/hTeBcXyoGd
— Telugu Desam Party (@JaiTDP) April 11, 2024