ఏపీ సీఎం జగన్ అంటే..పార్టీ నేతలకు అమితమైన గౌరవం. ఎవరూ కోరి తెచ్చుకున్నది కాదు.. స్వయంగా అందరూ.. ఆయనను అలా అభిమానిస్తారు. ఆ మెస్మరిజం ఏంటనేది.. చెప్పడం కష్టమే. అసలు జగన్ కూర్చున్న సీటు ముందు ఎవరికీ కుర్చీలు ఉండవని.. గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన మైసూరా రెడ్డి చెప్పారు.
అయితే.. మరికొందరు అన్నారు.. అసలుజగన్ను చూస్తే.. ఎవరికీ ఆయన ముందు కూర్చోవాలని అనిపించదు.. ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ.. అలా ఉండిపోవాలని ఉంటుంది. అందుకే అక్కడ కుర్చీలు ఉండవని చెప్పుకొచ్చారు.
అయితే.. ఇప్పుడు ఈ మెస్మరిజం పోతోంది. అప్పటి గౌరవమూ సన్నగిల్లుతోంది. కొందరు నేతలు రెబల్స్ గా మారుతున్నారు. దీంతో సీఎం జగన్ విలువ డాలరుతో పోలిస్తే… నానాటికీ రూపాయి విలువ ఎలా సన్నగిల్లుతోందో ఇప్పుడు అలానే దిగజారిపోతోందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి రీజనేంటి అనేది అందరికీ తెలిసిందే.
తమను పట్టించుకోవడం లేదని. కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని.. తాము జెండా మోసి జై కొట్టి పార్టీని అధికారంలోకి తెచ్చామనే విషయాన్ని కూడా పక్కన పెడుతున్నారని.. అంటున్నారు. ఈ క్రమంలోనే రెబల్స్‌గా మారుతున్నవారు.. ఒకప్పుడు జగన్ గారు అన్ననోటితోనే.. ఒకప్పుడు జగనన్న అన్న నోటితోనే.. ఇప్పుడు పరుషంగా.. ఏకవచనంతో జగన్ అని సంబోధిస్తున్నారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నుంచి తాజాగా రెబల్ అయిపోయిన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ వరకు చాలా మంది “జగన్“ “జగన్“ అనే సంబోధిస్తుండడం గమనార్హం. ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి కూడా జగన్ అనే అనేశారు. గతంలో రఘురామ.. జగన్ సర్ అని పిలిచేవారు. ఆనం.. జగన్ గారు అనేవారు. కోటంరెడ్డి.. మా అన్న.. జగనన్న అని ముద్దుగా పిలిచేవారు. కానీ,ఇప్పుడు.. మాత్రం.. జగన్ అని ముక్తసరిగా సరిపెడుతున్నారు. ఇక, ఎన్నికల సమయానికి ఇంకెంత మంది రెబల్స్ పెరుగుతారో చూడాలి.