ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని రంగాలలోనూ రాష్ట్రం నెంబర్ వన్ గా దూసుకుపోతుందని వైసీపీ నేతలు డప్పుకొడుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధిలోనూ పరిశ్రమల, నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, అది ఇది అని కాకుండా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని వారు గొప్పలు పోతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
జగన్ సీఎం అయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కాస్త గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. గత ఏడాది అత్యధిక మొత్తంలో గంజాయి పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో తొలి స్థానాన్ని ఏపీ దక్కించుకుందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ప్రతి దాంట్లో నెంబర్ వన్ అంటున్న జగన్ ని జనం ఇలా ప్రశ్నిస్తున్నారు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
గంజాయి రవాణా..పన్నుల బాదుడు…గుంతల రోడ్లు…ఇలా అన్నిట్లో మనల్ని కొట్టేవాడు లేడు అన్న అంటూ జనానికి జగన్ సమాధానం ఇచ్చినట్టుగా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పేదలకు పప్పు పంచదార కూడా ఇవ్వలేని జగన్ వంటి దద్దమ్మ ముఖ్యమంత్రిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చూసి ఉండరు, ఇది కేవలం జగన్ మాత్రమే సాధించిన రికార్డు అని లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ వచ్చిన తర్వాత రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని, అరకొరగా కొంతమందికే పంచదార కందిపప్పు అప్పుడప్పుడు ఇస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. తాడేపల్లిలో బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలైనా ఆ ఊసే ఎత్తలేదని, ఇంటి పక్కనే చిన్న బ్రిడ్జి కట్టించలేని జగన్ 3 రాజధానులు కడతాడట అని ఎద్దేవా చేశారు.
నాడు ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు, పెట్టుబడులు రావడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన నారా చంద్రబాబునాయుడు పాలన..
నేడు ఆంధ్రప్రదేశ్ ను గంజాయి సాగులో, మద్యం అమ్మకాల్లో, పేకాటలో దేశంలోనే నెంబర్ స్థానానికి తీసుకెళ్ళిన జగన్ రెడ్డి పాలన…(1/2) pic.twitter.com/TE6NpZRQ3E
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2022