వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ కు లోకేష్ తనదైన రీతిలో దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ‘ఎందరో మహానుభావులు.. ఒక్కరే ‘చీప్’ మినిస్టర్ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.
ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కు సేవలందించిన మాజీ ముఖ్యమంత్రులంతా ఒక వైపు, సమయం సందర్భం లేకుండా వెకిలి నవ్వులు నవ్వే జగన్ మరోవైపు ఉన్న ఫొటోను లోకేష్ షేర్ చేశారు.. చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అంటూ లోకేష్ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటో చూసిన టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. బిత్తర కుమార్ అంటూ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన జగన్….ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
సీఎం పదవికి ఒక విలువ, గౌరవం ఉందని, రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన సీఎం….ప్రతిపక్ష నేతల భార్యల గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడే చవట సన్నాసిలా ప్రవర్తిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. సీఎం అయిన జగన్ ఇలా అవాకులు చవాకులు పేలుస్తూ కాలయాపన చేస్తుంటే…ప్రతిపక్ష నేత అయిన లోకేష్ మాత్రం పాదయాత్రలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ప్రజలతో మమేకమైన లోకేష్…ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారని ప్రశంసిస్తున్నారు.