కొత్త జిల్లాలతో ఏపీ ని జగన్ రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నాడని… కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు.
ఒకవైపు కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి తెలంగాణ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని పక్కనే చూస్తూ కూడా గమనించలేకపోయిన జగన్ ఒక చేతకాని ముఖ్యమంత్రి.
కొత్త జిల్లాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మినహా దేనికీ పనికిరావు. రాజధాని కట్టలేని వాడు పదమూడు కొత్త జిల్లా కేంద్రాలకు అవసరమైన భవనాలను కడతాడా? ఇదెలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్టుంది అని తులసిరెడ్డి జగన్ పై పంచులు వేశారు.
జీతాలకు డబ్బుల్లేవు. కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవు. రోడ్లకు గుంతలు పూడ్చే డబ్బుల్లేవు. కానీ కొత్త జిల్లాలు కావల్సి వచ్చిందా మీకు అని నిలదీశారు.
ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటు ఒక తెలివితక్కువ వ్యయప్రయాసల నిర్ణయం అని తులసి రెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకుంటే రాష్ట్రానికి మంచిది అన్నారాయన.
రాష్ట్రాన్ని తిరోగమనం వైపు పయనించేలా నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు.