తనపై సీఎం జగన్ చేసిన ఛాలెంజ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అని, ప్రజలను పట్టి పీడిస్తున్నాడు అని జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఇంకొన్ని నెలల్లో సైకో పోవడం ఖాయం అని, రాష్ట్రం నుంచి సైకో పోకపోతే.. మనమే రాష్ట్రం వదిలి పోయే పరిస్థితి ఉందని చంద్రబాబు చెప్పారు. ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది. మధ్యలో సైకో పెత్తనం ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటికి స్టిక్కర్లు అతికించడం అనైతికం. చట్ట వ్యతిరేకం అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
వాలంటీర్లకు ఇచ్చేది ప్రజాధనం కాదా? అని చంద్రబాబు నిలదీశారు. వారికేమన్నా జగన్ తాత ముత్తాతల సొమ్ము తెచ్చి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. నంగి నంగిగా మాట్లాడుతూ జగనే భవిష్యత్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. జగనే మా నమ్మకం కాదు.. జగనే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం…. జగన్ పోతేనే పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమే అని చంద్రబాబు సెటైర్లు వేశారు.
బాబాయ్ ది మొదటి రోజు గుండెపోటు.. తర్వాత రక్తపోటు. ఆ తర్వాత.. గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వారు దొంగలు.. వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు, ఆర్థిక ఉగ్రవాదులు అని చంద్రబాబు మండిపడ్డారు. నిత్యావసర ధరలు పెరిగాయని, కరెంటు చార్జీలు పెంచారని, ఇచ్చేది పది.. గుంజేది వంద అని అన్నారు. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారని హరీశ్ రావు కామెంట్లనుద్దేశించి జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.