రాబోయే రెండేళ్ల కాలంలో ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద హోంవర్క్ ఇచ్చారు. మంత్రులైనా, ఎంఎల్ఏలైనా రెగ్యులర్ గా జనాల్లోనే ఉండాలని స్పష్టంగా చెప్పేశారు. జనాలు మన దగ్గరకు రావడం కాదు మనమే జనాల దగ్గరకు వెళ్ళాలని స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగానే గడప-గడపకు ఎంఎల్ఏలే వెళ్ళాలి. జనాలందరినీ వ్యక్తిగతంగా కలవటానికి ఇంతకు మించిన కార్యక్రమం మరోటి లేదని కూడా జగన్ క్లియర్ గా చెప్పేశారు.
జనాల సమస్యలు తెలుసుకోవాలన్నా, వాటిని పరిష్కారించాలన్నా నేరుగా జనాలను కలవటం ఒకటే మార్గమన్నారు. ప్రతి ఇంటి గడపను తొక్కకపోతే మళ్ళీ గెలుపు కష్టమని చెప్పారు. వచ్చే రెండేళ్ళు పరీక్షా సమయమే అని జగన్ గట్టిగానే హెచ్చరించారు. ఈ రెండేళ్ళ పరీక్షలో గెలవకపోతే టికెట్లు రావని కూడా స్పష్టంగా చెప్పేశారు. ప్రతి ఇంటికి ఎంఎల్ఏలు తిరగాల్సిందే అని, ఎంఎల్ఏల పనితీరును తాను లెక్కపెడుతానని కూడా వార్నింగిచ్చారు.
ఎంఎల్ఏలుగా ఎవరు పోటీ చేస్తున్నారని కాకుండా టికెట్లు ఎవరికిస్తే గెలుస్తారన్నదే తనకు ముఖ్యమన్నారు. గెలుస్తారని తనకు నమ్మకం ఉన్నవారికి మాత్రమే టికెట్లిస్తానని ఇందులో మొహమాటాలకు చోటులేదని కూడా స్పష్టంగా తేల్చిచెప్పారు. అసలే జగన్ మనస్తత్వం చాలా మందికి తెలుసు. ఎలాంటి మొహమాటాలు లేకుండా చెప్పదలచుకున్నది చెప్పేస్తారు, చేయదలచుకున్నది చేసేస్తారు. ఎవరెంత గింజుకున్నా తర్వాత ఎలాంటి ఉపయోగం ఉండదని ఇప్పటికే అనేకసార్లు నిరూపణైంది.
పనితీరు బాగుందని తన సర్వేల్లో తేలిన వారికి మాత్రమే టికెలిస్తానని కూడా ముందే చెప్పేశారు. ఎంఎల్ఏల పనితీరును బట్టే పార్టీ గెలుపు ఆధారపడుంటుందన్న విషయాన్ని అందరికీ అర్ధమయ్యేట్లు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు టచ్ చేసి తీరాల్సిందే అని గట్టిగా చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్ళినపుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, అర్హులైన వారికి పథకాలు అందుతున్నది లేనిది తెలుసుకోవాలని జగన్ చెప్పారు. ఉపాధి హామీ పథకంలోని బిల్లులు సహా అన్నీ పెండింగ్ బిల్లులను ఏప్రిల్ 10వ తేదీలోగా చెల్లించేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఎంఎల్ఏలు భారీ హోంవర్కు చేయాల్సిందే.
అయితే ఇక్కడో విషయం గమనించాలి… సాధారణంగా ఎమ్మెల్యేలు సభ పెట్టినపుడు ఎవరైనా సమస్యల పరిష్కారం కోసం అడిగితేనే కోప్పడుతున్నారు. కొడుతున్నారు. చంపుతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన వ్యక్తి మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మొన్న చింతలపూడి ఎమ్మెల్యేను ప్రశ్నించిన వ్యక్తిని పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఇలా అభివృద్ధి గురించి అడిగితే తట్టుకోలేని వారు జనం ఇంటికి వస్తే వారి కడుపు మంటతో తిట్టే తిట్లకు తట్టుకుంటారా? వారిని ఏమైనా చేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో !
చింతలపూడి @YSRCParty ఎమ్మెల్యేని అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు రాజారెడ్డి రాజ్యాంగం అమలు.. #RowdyRajyam pic.twitter.com/pAqJu1cjg2
— iTDP Official (@iTDP_Official) March 9, 2022