రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏడు జిల్లా ల్లో పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా నివేదిక కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించిందని.. అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఈ 30 జిల్లాల్లో ఏపీలోని 7 జిల్లాలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఇక్కడ పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని.. కూడా ఆదేశించింది. అయితే.. సీఎం జగన్ మాత్రం `ఎంతో చేస్తున్నాం` అం టూ.. ప్రకటనలు చేస్తున్నారే తప్ప.. పటిష్టమైన చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.
నానాటికీ పెరుగుతున్న కరోనా బాధితులతో ముఖ్యంగా ప్రభుత్వ వైద్య శాలలు చాలడం లేదు. ఆక్సిజన్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆక్సిజన్ అందక అనేక జిల్లాల్లో ఇప్పటికీ మరణాలు సంభ విస్తున్నాయి.
ఇక, పడకలు లేక.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోగులకు నేలపైనే చి కిత్సలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నా రు. దీంతో బాధితులకు కరోనా కన్నా..ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వారి బంధువు లు.
ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని.. బాధితులకు భరోసా అందించేం దుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు.కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని, అందిస్తామని పదే పదే చెబుతున్నా.. ఎక్కడా ఇది అమలు కావడం లేదు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచిస్తు న్నా.. ఇది కూడా అమలు జరగడం లేదు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాల న్న ఆదేశాలు పాటిస్తున్న వారు ఏ ఒక్కరూ కనిపించడం లేదు.
అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్ స్పష్టం చేస్తు న్నా.. కేవలం.. ఇది తాత్కాలిక ఆదేశంగానో.. లేక మీడియా కోసమో చేసినట్టుగా ఉందనే భావన వ్యక్తమవు తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సీఎం జగన్ ఇస్తున్న ఆదేశాలు కేవలం ఉడత ఊపులు.. పిల్లి ఆదేశాల మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.