విచారణలో ఉన్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి కాస్త రిలీఫ్ దొరుకుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రిగా జగన్ను తొలగించాలని, కంటెంప్ట్ ఆఫ్ కేసును విచారించిన త్రిసభ ధర్మాసనం కేసులను కొట్టేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, ఆరుగురు జడ్జీలతో పాటు సుప్రింకోర్టు జస్టిన్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లేఖ రూపంలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి జగన్ ఫిర్యాదు చేశారు. ఓ నాలుగు రోజుల తర్వాత ఆ లేఖను మీడియాకు విడుదల చేయించటంతో దేశంలో పెద్ద సంచలనమే అయ్యింది.
ఆ తర్వాత ఇదే విషయమై రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణుల మధ్య పెద్ద డిబేట్ జరిగింది. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బయటపెట్టడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టంటూ కొందరు గట్టిగా వాదించారు. ఇదే సమయంలో తాను రాసిన లేఖను తానే బయటపెట్టడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు క్రిందకు రాదని మరికొందరు గట్టిగా బదులిచ్చారు. ఈ నేపధ్యంలోనే కొందరు లాయర్లు సుప్రింకోర్టులో జగన్ కు వ్యతిరేకంగా కేసులు వేశారు. జగన్ పై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రిగా జగన్ను అనర్హుడినిగా ప్రకటించాలని మరో కేసు వేశారు.
ఈ కేసులను విచారించిన త్రిసభ ధర్మాసనం అన్నీ కేసులను మంగళవారం కొట్టేసింది. తాను రాసిన లేఖలను జగన్ మీడియాకు విడుదల చేయటం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు క్రిందకు రాదని ధర్మాసనం తేల్చిచెప్పేసింది. ఆ మధ్య సుప్రింకోర్టు బెంచ్ గ్యాగ్ ఆర్డర్ నే కొట్టేసిన తర్వాత ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసును విచారించాల్సిన అవసరమే లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే సమయంలో జగన్ను సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని వేసిన కేసును కూడా కొట్టేసింది. ఆ విషయం తమ పరిధిలో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సుప్రింకోర్టేమో హైకోర్టు వ్యాఖ్యలను తప్పుపడుతు, హైకోర్టులో ఇచ్చిన స్టేలను ఎత్తేస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను సుప్రింకోర్టు ఎత్తయటం ఇందులో భాగమే.