టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల జిల్లాలోని మేదరమట్లలో ఆదివారం వైసీపీ సిద్ధం బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరైన జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు కిచిడీ వాగ్దానాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు వాగ్ధానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదని సెటైర్ వేశారు.
చంద్రబాబు కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టో కాపీ కొట్టారని ఆరోపించారు.
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 7 హామీలకు ఏటా రూ.87,312 కోట్లు కావాలని.. ఇంత డబ్బును ఎక్కడ నుండి తీసుకొస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్ర
జలను మోసం చేసేందుకే ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇస్తారని ఫైర్ అయ్యారు.
అయితే.. చంద్రబాబు హామీల అమలుకు వేల కోట్లు ఖర్చవుతాయన్న జగన్ మాటలపై సోషల్ మీడియాలోనే కాదు సొంత పార్టీలోనూ విమర్శలు వస్తున్నాయి.
జగన్ అయిదేళ్లుగా సంక్షేమ పథకాలకు డబ్బులెలా తెస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా.. రెవెన్యూ కూడా లేకుండా కేవలం అప్పుల మీదే జగన్ బండి నడిపిస్తున్నారని.. చంద్రబాబుకు రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో, సంపద ఎలా సృష్టించాలో తెలుసని సోషల్ మీడియా వేదికగా జనం రెస్పాండ్ అవుతున్నారు.
కాగా జగన్ తన సిద్ధం సభలో చంద్రబాబుపై మరిన్ని విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు హద్దే ఉండదని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు సిద్ధం అవుతున్నారని విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబుది అబ్ధదాలు చెప్పే సిద్ధాంతం అని.. ఆయన హామీలు నమ్మితే మోసపోక తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబు వస్తే ప్రస్తుతం అమలు అవుతోన్న సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవుతాయని.. మళ్లీ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పథకాల రద్దు తప్పదని హెచ్చరించారు.
అయితే.. జనం మాత్రం జగన్ మాటలు ఏమాత్రం నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. జగన్ ఉంటేనే పథకాలు ఆగిపోతాయని.. అప్పులతో పథకాలు నడిపిస్తున్న ఆయన ముందుముందు అప్పు పుట్టకపోతే పథకాలు ఎలా కొనసాగిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు.
అదే చంద్రబాబు అయితే, రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక విధానాలతో రెవెన్యూ సృష్టించి పథకాలకు డబ్బు తేగలరని అంటున్నారు.