• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ గురివింద నీతి.. బాబాయ్ హత్యపై ఇప్పుడేమంటారు?

admin by admin
December 2, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
277
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ.. ఏం లాభం? సొంత బాబాయ్ ను ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా.. పాశవికంగా హతమార్చిన ఉదంతానికి సంబంధించిన న్యాయ విచారణ తాను పాలిస్తున్న ఏపీలో కాకుండా పక్క రాష్ట్రానికి విచారణకు బదిలీ చేయటం దేనికి సంకేతం. నోరు విప్పితే మాటలు కోటలు దాటించే జగన్.. మిగిలిన ఏ విషయంలో అయినా మాటలు చెప్పగలరేమో కానీ.. బాబాయ్ హత్య ఎపిసోడ్ మీద ఆయనేం చెప్పినా అతికినట్లుగా ఉండదన్నది మాత్రం నిజం.

సొంత బాబాయ్ హత్య కేసు తన ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నిజాయితీగా జరగటం లేదని.. దర్యాప్తునకు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి దేశ అత్యున్నత న్యాయస్థానం బదిలీ చేయటంపైన ఆయన ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చినా ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇంతకు మించిన అవమానం.. ఇంతకు మించిన సిగ్గుచేటు వ్యవహారం మరొకటి ఉండదనే చెప్పాలి.

రాష్ట్రంలోని కోట్లాది మంది మాన.. ప్రాణ ఆస్తులకు రక్షణగా ఉంటానని జగన్ నోటి నుంచి వచ్చే మాటలు ఇకపై నవ్వులాటగా మారటం ఖాయమంటున్నారు. సొంత బాబాయ్ దారుణ హత్య మీద విచారణనే సరిగా జరిపించే విషయంలో ఫెయిల్ అయిన జగన్.. మిగిలిన వారి గురించి ఇంకేం పట్టించుకుంటారన్న మాట ఆయన్ను వెంటాడటం ఖాయం. ఆయనరాజకీయ కెరీర్ మొత్తంలో బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం ఒక మచ్చలా మారటం ఖాయమని చెప్పక తప్పదు.

బాబాయ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏపీలోని పరిస్థితుల గురించి అత్యున్నత న్యాయస్థానం వెలుబుచ్చిన అభిప్రాయాలు జగన్ పాలనపై కొత్త సందేహాల్ని కలిగించేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితి రావటం బ్యాడ్ లక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజా ఆదేశాలతో.. ఏపీలో ఆరాచక పాలన సాగుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.

నిజానికి సొంత బాబాయ్ దారుణంగా హత్య చేసినప్పుడు.. తానే సీఎంగా ఉన్న వేళలో.. విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ..అదేమీ లేకుండా.. చివరకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని కోరటం.. నిష్పక్షపాతంగా విచారణ జరగటం లేదన్న జగన్ సోదరి సందేహాలు జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయని చెప్పాలి. నిజానికి ఒక ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి విచారణకు మారుస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి ఉండేవారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయినా.. సీఎం జగన్ కు ఇలాంటి ఆలోచనలు మనసులోకి వస్తాయా? అసలు ఆ ఫీలింగ్స్ ఆయనలో ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఆయన చెబితేనే బాగుంటుంది. కాదంటారా?

Tags: case shiftedJagantelangana high courtviveka's murder
Previous Post

లోకేష్ కు హైకోర్టులో భారీ ఊరట

Next Post

‘జంపింగ్ జపాంగ్’ వంశీకి పట్టాభి ఛాలెంజ్

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post
pattabhi

‘జంపింగ్ జపాంగ్’ వంశీకి పట్టాభి ఛాలెంజ్

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra