This one before Blue party government. Selected cases ని షో కేస్ చేసి.. ఇదంతా మా క్రెడిట్ అని డప్పు కొట్టుకోవాలి అంటే.. ఇలాంటివి బోలెడు ఉన్నాయి..
బెండపూడి స్కూల్ విషయంలో కూడా బ్లూ గాళ్ల క్రెడిట్ ఏమీ లేదు. ఒక అధికారి, ఒక అధ్యాపకుని కృషి అంతే.. ఆ స్కూల్ లోనే 483 మంది ఉన్నారు కానీ https://t.co/Cds66NAydT
— anigalla???????? (@anigalla) May 19, 2022
పావలా కోడికి ముప్పావలా.. మసాలా! అనేది సామెత. కానీ.. ఏపీలోని జగన్ సర్కారు దీనిని నిజం చేస్తోంద ని అంటున్నారు నెటిజన్లు. ఇది ఒకింత ఆశ్చర్యమే అయినా.. జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే.. ఔననే అంటున్నారు అధికారులు కూడా! దీంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది. ఇంతకీ సంగతేంటంటే..
రాష్ట్రంలోని బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అమెరికన్ యాసలో ఆంగ్లం మాట్లా డటంపై సీఎం జగన్ సంతోషపడి పోయారు. వారిని పిలిచి మరీ సత్కరించారు. అయితే.. ఇలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ కోసం.. ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం అక్షరాలా 20 వేల కోట్ల రూపాయలు. మొత్తంగా ఇలా ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తే.. ఇంగ్లీష్ వచ్చిన, మాట్లాడుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం ఐదుగురు. ఇదే ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చే చేసింది.
రాష్ట్రంలో అమ్మ ఒడి, నాడు-నేడు కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.21 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇవన్నీ కూడా విద్యార్థుల కోసమే. పైగా ఆంగ్లాన్ని ప్రమోట్ చేసేందుకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. డిక్షనరీలు కూడా ఇచ్చింది. అయినప్పటికీ.. కేవలం ఐదుగురు విద్యార్తులకు మాత్రమే ఇంగ్లీష్ రావడం.. ఖర్చు చూస్తే.. భారీ ఎత్తున ఉండడం సంచలనంగా మారింది.
వాస్తవానికి చదువు వేరు, భాష వేరు. ఏ భాషలో చదివినా జ్ఝానమే ముఖ్యం. ఉత్తమ విద్యార్థులుగా రాణించాలంటే… భాష సరిపోదు, చదువు ముఖ్యం. మంచి చదువుకు కరికులం, సాధన… మార్గదర్శనం వల్ల వస్తుంది. ఈ సత్యాన్ని మరచిపోయిన సర్కారు.. కేవలం పుస్తకాలు కొనివ్వడం.. ప్రజాధనాన్ని పంచిపెట్టడం ద్వారా.. ఏదో సాధించాలనే తపన పడడంతో వ్రతం చెడ్డా ఫలితం మాత్రం దక్కలేదు.
నిజానికి అమెరికాలో ఉండే వారితో రోజూ మాట్లాడించాలి. లేదా.. ఇక్కడ ఉపాధ్యులకు ధారాళమైన ఆంగ్ల పరిజ్ఞానం ఉండి ఉండాలి. ఈ రెండు లేకుండా.. వేల కోట్లు ధారపోసి ఏం చేసేటట్టు అనేది నెటిజన్ల మాట. పిల్లలకు మాతృభాషతోపాటు సైన్స్, గణితం, సాంఘికశాస్త్రం, ఇతర నైపుణ్యాలేవీ రాకుండా ఒక్క ఆంగ్లంతోనే ఉపాధి అవకాశాలు ఉంటాయా? అనేది కూడా నెటిజన్ల ప్రశ్న. ఏదేమైనా.. పావలా కోడికి జగన్ సర్కారు ముప్పావలా ఖర్చు పెట్టిందనే విమర్శలు వస్తుండడం గమనార్హం.
బెండపూడి లో అందరికి తెలిసింది బయటకి ఎలా తెలుస్తుంది లే అని క్రెడిట్ దొబ్బేద్దామనుకున్నాడు జగన్
దొరికిపోయాడు చీప్ ఫెలో pic.twitter.com/FVZ5HKl3JG
— Srivalli (@srivalli2000) May 20, 2022
భళా బెండపూడి….
ఏడేళ్ల కిందటే సక్సెస్ స్కూల్ గా గుర్తింపు పొందిన బెండపూడి స్కూల్……. నాటి నుంచే ఆంగ్లం మాధ్యమం లో దిట్ట..????
ఇప్పుడు అంతా తానే ఐనట్లు ఆ స్కూల్ పిల్లలతో సీఎం ముచ్చట్లు..
ఏడేళ్ల కిందట అంటే చంద్రబాబు గారి హయాంలో.✌️✌️
అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలి రా జగనాధాం???? pic.twitter.com/69MP73susd— Vineela Paladugu (@PaladuguVineela) May 20, 2022